LIC IPO: త్వరలో ఎల్ఐసీ ఐపీఓ.. పాలసీదారులు ఇందులో పాల్గొనడానికి ఈ పని చేయాలి..

దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మెగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO)పై అందరి దృష్టి ఉంది...

LIC IPO: త్వరలో ఎల్ఐసీ ఐపీఓ.. పాలసీదారులు ఇందులో పాల్గొనడానికి ఈ పని చేయాలి..
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 03, 2022 | 3:25 PM

దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మెగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO)పై అందరి దృష్టి ఉంది. ప్రభుత్వం వచ్చే వారంలోగా మార్కెట్ నియంత్రణ సంస్థ SEBIకి LIC IPO కోసం ముసాయిదా పత్రాలను దాఖలు చేయవచ్చు. 2022-23 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఎల్‌ఐసీ ఇష్యూ త్వరలో వస్తుందని భావిస్తున్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (sebi) ఆమోదం పొందిన తర్వాత ఎల్‌ఐసీ ఐపిఒ మార్చి నాటికి మార్కెట్‌లోకి రావచ్చని డిఐపిఎఎమ్ సెక్రటరీ తుహిన్ కాంత్ పాండే తెలిపారు.

2022-23 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఎల్‌ఐసీ ఇష్యూ త్వరలో వస్తుందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని రూ.78,000 కోట్లకు తగ్గించారు. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎల్‌ఐసీ కూడా ముఖ్యం.

పాలసీదారులు LIC IPOలో పాల్గొనలనుకుంటున్నారా..

ఎల్‌ఐసీ పాలసీదారులు IPOలో పాల్గొనాలనుకుంటే LIC పాలసీ ఖాతాలో తప్పనిసరిగా పాన్ నంబర్ (PAN) ఉండాలి. మీకు తప్పనిసరిగా డీమ్యాట్ ఖాతా ఉండాలి. రాబోయే LIC IPOలో, ఇష్యూ పరిమాణంలో 10 శాతం వరకు పాలసీదారులకు రిజర్వ్ చేశారు. జీవిత బీమా సంస్థ తన పాలసీదారులను వారి పాన్‌ను అప్‌డేట్ చేయమని కోరింది, తద్వారా వారు ప్రతిపాదిత పబ్లిక్ ఆఫర్‌లో పాల్గొనవచ్చు. అటువంటి పబ్లిక్ ఆఫర్‌లో పాల్గొనడానికి, పాలసీదారులు తమ పాన్ వివరాలు కార్పొరేషన్ రికార్డులలో అప్‌డేట్ చేయాలి. డీమ్యాట్ ఖాతా ఉంటేనే భారతదేశంలో ఏదైనా పబ్లిక్ ఆఫర్‌కు సబ్‌స్క్రిప్షన్ సాధ్యమవుతుందని LIC ఇంతకు ముందు పబ్లిక్ నోటీసులో పేర్కొంది.

LIC పాలసీతో పాన్‌ను ఎలా లింక్ చేయాలి

ముందుగా https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatusకి వెళ్లాలి. బాక్స్‌లో మీ పాలసీ నంబర్, పుట్టిన తేదీ (రోజు/నెల/సంవత్సరం), పాన్, క్యాప్చా నమోదు చేసి సబ్‌మిట్ బటన్‌ను నొక్కండి. దీని తర్వాత మీరు మీ LIC పాలసీ, PAN లింక్ స్థితిని చూస్తారు.

డీమ్యాట్ ఖాతా

ఈక్విటీ మార్కెట్లలో షేర్లను కొనడానికి, విక్రయించడానికి డీమ్యాట్ ఖాతా ప్రధాన అవసరాలలో ఒకటి. ఈ ఖాతాలు NSDL, CDSL వంటి డిపాజిటరీ సంస్థలు నిర్వహిస్తాయి. ఆధార్, పాన్ వివరాలు, చిరునామా రుజువు వంటి పత్రాలు కూడా అవసరం. ఎల్‌ఐసీకి 25 కోట్ల మంది పాలసీదారులు ఉండగా, డీమ్యాట్ ఖాతాల సంఖ్య 8 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. కానీ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని రూ.78 వేల కోట్లకు తగ్గించింది. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ, ఇతర పీఎస్‌యూలలో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు రూ.12,000 కోట్లను సమీకరించింది.

Read Also. Loan EMI Tips: లోన్ EMI మీకు భారంగా మారిందా.. ఈ చిట్కాలతో రుణాన్ని తిరిగి చెల్లించడం చాలా ఈజీ..