Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facebook: ఫేస్‌బుక్‌కు చెమటలు పట్టిస్తున్న టిక్‌టాక్, యూట్యూబ్.. విషయం ఏంటంటే..?

ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా కంపెనీలలో ఒకటైన మెటా ఇప్పుడు ముప్పులో పడింది.

Facebook: ఫేస్‌బుక్‌కు చెమటలు పట్టిస్తున్న టిక్‌టాక్, యూట్యూబ్.. విషయం ఏంటంటే..?
Facebook
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 03, 2022 | 4:24 PM

ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా కంపెనీలలో ఒకటైన మెటా ఇప్పుడు ముప్పులో పడింది. ఫేస్‌బు(Facebook), ఇన్‌స్టాగ్రామ్(Instagram), వాట్సప్(WhatsApp) వంటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల మాతృ సంస్థ Meta Platforms Inc. ఇప్పుడు చైనా సోషల్ మీడియా యాప్ Tiktok, Googleకు చెందిన YouTube నుండి గట్టి పోటీని ఎదుర్కొంటుంది.

టిక్‌టాక్, యూట్యూబ్ కారణంగా మెటా ఆదాయంపై ప్రభావం పడుతుంది. రాబోయే కాలంలో తమ ఆదాయం తీవ్రంగా దెబ్బతింటుందని మెటా స్వయంగా అంగీకరించింది. బుధవారం, మార్క్ జుకర్‌బర్గ్ కంపెనీ మెటా స్టాక్ 20 శాతం భారీ క్షీణతను నమోదు చేసింది. దీనితో పాటు, కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా 200 బిలియన్ డాలర్లకు పడిపోయింది. కంపెనీ పనితీరు ఊహించిన దానికంటే తక్కువగా ఉంది.

రాయిటర్స్ నివేదిక ప్రకారం మొదటి త్రైమాసికంలో అంచనా వేసిన పనితీరు క్షీణించవచ్చని మెటా తెలిపింది. Facebook, Instagramలో ఇతర కంపెనీల ప్రమోషన్లను అమలు చేయడంలో సమస్యలు ఉన్నాయి. మార్క్ జుకర్‌బర్గ్ కంపెనీ ఫేస్‌బుక్ ఫిబ్రవరి 2004లో ప్రారంభమైంది. మరోవైపు, చైనా కంపెనీ బైట్‌డాన్స్‌కు చెందిన టిక్‌టాక్ సెప్టెంబర్ 2016లో వచ్చింది. ఐదేళ్ల క్రితం వచ్చిన టిక్‌టాక్.. 18 ఏళ్లుగా ఇంటర్నెట్‌ను శాసిస్తూ ఫేస్‌బుక్‌కు టెన్షన్‌ను కలిగిస్తోంది. అంతే కాదు టిక్‌టాక్‌తో పాటు యూట్యూబ్ కూడా ఫేస్‌బుక్‌కు తలనొప్పిగా మారింది. నిజానికి, ఫేస్‌బుక్‌లోని చాలా మంది వినియోగదారులు ఇప్పుడు టిక్‌టాక్, యూట్యూబ్‌లో తమ సమయాన్ని వెచ్చిస్తున్నారు.

నివేదిక ప్రకారం, వినియోగదారుల మూడ్ కారణంగా, రాబోయే త్రైమాసికంలో మెటా ఆదాయం తగ్గవచ్చన చెబుతున్నారు. గత ఏడాది చివరి త్రైమాసికంలో, ఫేస్‌బుక్ నెలవారీ యాక్టివ్ వినియోగదారుల సంఖ్య 2.91 బిలియన్లు కాగా, మూడో త్రైమాసికంలో కూడా కంపెనీ క్రియాశీల వినియోగదారుల సంఖ్య దాదాపు అదే స్థాయిలో ఉంది. మూడో త్రైమాసికంతో పోలిస్తే నాలుగో త్రైమాసికంలో ఫేస్‌బుక్ యాక్టివ్ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరగలేదు.

Read Also.. Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలపై కనిపించని బడ్జెట్ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..