NPS: ఆన్‌లైన్‌లో ఎన్‌పీఎస్ ఖాతా తెరవలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఆర్థిక భ‌ద్రత చేకూర్చడంలో జాతీయ పింఛ‌ను పథకం(nps) ఎంతో మేలు చేస్తుంది. 18 నుంచి 70 సంవ‌త్సరాల‌ మ‌ధ్య వ‌య‌సు ఉన్న వ్యక్తులు ఈ ప‌థ‌కంలో చేర‌వ‌చ్చు...

NPS: ఆన్‌లైన్‌లో ఎన్‌పీఎస్ ఖాతా తెరవలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..
Nps (1)
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 03, 2022 | 5:01 PM

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఆర్థిక భ‌ద్రత చేకూర్చడంలో జాతీయ పింఛ‌ను పథకం(nps) ఎంతో మేలు చేస్తుంది. 18 నుంచి 70 సంవ‌త్సరాల‌ మ‌ధ్య వ‌య‌సు ఉన్న వ్యక్తులు ఈ ప‌థ‌కంలో చేర‌వ‌చ్చు. ఎన్‌పీఎస్‌లో కొత్తగా ఖాతా తెర‌వాల‌నుకుంటున్నవారు ఆధార్(aadhar) ఆధారిత ఆన్‌లైన్ కేవైసి ప్రక్రియను పూర్తి చేసి ఈ-ఎన్‌పీఎస్ ద్వారా ఖాతా తెర‌వ‌చ్చు. ఈ-ఎన్‌పీఎస్ అనేది ఆన్‌లైన్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలు (cra) నిర్వహించే ఆన్‌లైన్ ఎన్‌పీఎస్ ఆన్‌బోర్డింగ్ పోర్టల్. దీని ద్వారా ఎన్‌పీఎస్ ఖాతాను ఆన్‌లైన్‌లో ప్రారంభించ‌డంతో పాటు, డిపాజిట్ కూడా చేయ‌వ‌చ్చు. అలాగే ప్రస్తుతం ఉన్న చందాదారులు వారి టైర్ -2 ఖాతాను కూడా యాక్టివేట్ చేసుకోవ‌చ్చు.

ఆధార్‌తో రిజిస్ట్రేషన్

ఆధార్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో ఎన్‌పీఎస్ ఖాతా తెరవడానికి, చందాదారులు ఇ-ఎన్‌పీఎస్ పోర్టల్ ఓపెన్ చేయాలి

ఆ తర్వాత “నేషనల్ పెన్షన్ సిస్టమ్” పై క్లిక్ చేసి, ఆపై “రిజిస్ట్రేషన్” ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

చందాదారులు ఇప్పుడు ఖాతా ప్రారంభించే కేట‌గిరీని ఎంచుకోవాలి – “వ్యక్తిగత చందాదారుడు” లేదా “కార్పొరేట్చం

దాదారుడు”. ఇంకా, దరఖాస్తుదారుడి స్టేట‌స్‌ “సిటిజన్ ఆఫ్ ఇండియా” లేదా “నాన్-రెసిడెంట్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఐ)”

లేదా “ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసిఐ)” నుంచి ఎంపిక చేసుకోవాలి.

చందాదారులు రిజిస్ట్రేషన్ సమయంలో “ఆధార్ ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్ కేవైసి” ఎంచుకోవాలి, ఖాతా తెరవడానికి ‘టైర్ రకాలను’ ఎంచుకోవాలి.

ఆధార్ లేదా వర్చువల్ ఐడీ నంబ‌ర్‌ల‌లో.. కావ‌ల‌సిన దాన్ని ఎంచుకోవాలి. త‌ర్వాత‌ జెనరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ఒకవేళ

వర్చువల్ ఐడీ లేక‌పోతే, ముందు దానిని జెనరేట్ చేసుకోవాలి. ఆధార్ అనుసంధానిత మొబైల్ నంబ‌ర్‌కు వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేయాలి.

ఆధార్ వివరాలను ఉపయోగించడానికి సమ్మతితో పాటు ఓటీపీ సమర్పించిన తరువాత, మీ పేరు, లింగం, పుట్టిన తేదీ,

చిరునామా, ఫోటో మొదలైన వివ‌రాల‌ను ఆధార్ రికార్డుల నుంచి సేక‌రిస్తారు.

ఎన్‌పీఎస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఇతర తప్పనిసరి వివరాలను చందాదారుడు పూర్తి చేయాలి.

పాన్ కార్డ్‌, ర‌ద్దు చేసిన చెక్ స్కాన్ చేసిన కాపీని *.jpeg/ *.jpg/ *.png /*.pdf ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఫైల్ సైజ్ 4 కేబి నుంచి 2 ఎమ్‌బి మ‌ధ్యన ఉండాలి.

మీ సంత‌కాన్ని *.jpeg/ *.jpg/ *.png ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఫైల్ సైజ్ 4కేబి నుంచి 5ఎమ్‌బి మ‌ధ్యన ఉండాలి.

ఆ త‌ర్వాత‌ ఎన్‌పీఎస్‌కి కాంట్రిబ్యూట్ చేసే మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా డిపాజిట్ చేసి, డిజిటల్ ప్రామాణీకరణ ద్వారా డిజిటల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.

పాన్ ద్వారా రిజిస్ట్రేష‌న్ చేసుకునే వారికి కేవైసీ మీరు ఎంచుకున్న బ్యాంక్‌/ లేదా నాన్‌-బ్యాంక్ పిఓపి ద్వారా పూర్తిచేస్తారు.

రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో అందించే పేరు, చిరునామా త‌దిత‌ర వివ‌రాలు పీఓపీ రికార్డుల‌లో కేవైసి వెరిఫికేష‌న్ కోసం ఇచ్చిన వివ‌రాల‌తో స‌రిపోలాలి. ఒక‌వేళ స‌రిపోల‌క పోతే మీ అభ్యర్థన తిర‌స్కరించ‌బ‌డుతుంది. అటువంటి సంద‌ర్భంలో సంబంధిత‌ పీఓపీని సంప్రదించాలి.

Read Also.. Facebook: ఫేస్‌బుక్‌కు చెమటలు పట్టిస్తున్న టిక్‌టాక్, యూట్యూబ్.. విషయం ఏంటంటే..?

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి