AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: హైదరాబాద్‌ లో సందడి చేసిన నయనతార.. ఆ సినిమా షూటింగ్‌ కోసమేనా?

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార (Nayanatara) హైదరాబాద్‌ (Hyderabad) లో సందడి చేశారు. ఓ కారులో వెళుతూ కెమెరా కళ్లకు చిక్కారు. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ గా మారాయి.

Nayanthara: హైదరాబాద్‌ లో సందడి చేసిన నయనతార.. ఆ సినిమా షూటింగ్‌ కోసమేనా?
Nayanatara
Basha Shek
|

Updated on: Feb 03, 2022 | 2:56 PM

Share

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార (Nayanatara) హైదరాబాద్‌ (Hyderabad) లో సందడి చేశారు. ఓ కారులో వెళుతూ కెమెరా కళ్లకు చిక్కారు. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ గా మారాయి. అయితే మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తోన్న ‘గాడ్‌ ఫాదర్‌’ (Godfather) షూటింగ్‌ కోసమే నయన్‌ హైదరాబాద్‌ వచ్చారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి తన షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకున్నారని సమాచారం. ఈక్రమంలోనే హైదరాబాద్ లో కనిపించారని తెలుస్తోంది. కాగా మలయాళ సూపర్‌హిట్‌ ‘లూసిఫర్‌’ రీమేక్‌ గా ‘గాడ్ ఫాదర్’ రూపొందుతోంది. ‘సైరా’ తర్వాత చిరంజీవి, నయన్‌ మరోసారి స్ర్కీన్‌ షేర్‌ చేసుకోనున్నారు. మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ లో శరవేగంగా జరుగుతోంది.

కాగా చిరంజీవి కొద్ది రోజుల క్రిత కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్‌ లో ఉంటున్నారు. దీంతో చిరు లేకుండానే మిగతా నటీనటులతో సినిమా చిత్రీకరణను జరుపుతున్నారు. ఇందులో భాగంగానే నయన్‌ తాజాగా షూటింగ్‌ ముగించుకుని వెళ్తూ హైదరాబాద్‌ లో కనిపించారని తెలుస్తోంది. కాగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. మరో టాలీవుడ్‌ నటుడు సత్యదేవ్‌ కూడా ఈ సినిమాలో మెరవనున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్‌ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాను నిర్మిస్తున్నాయి. ఎస్‌.ఎస్‌.థమన్‌ బాణీలు సమకూరుస్తున్నారు.

Also Read:Chakravarthy: పాటలను స్వరాల పల్లకీలో ఊరేగించిన సంగీత చక్రవర్తి

Payal Rajput: చిలిపి ఫోజులు ఆకట్టుకుంటున్న చిన్నది

OTT in February: ఫిబ్రవరిలో ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..