AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahaan Trailer: అదరగొట్టిన తండ్రీకొడుకులు.. విక్రమ్‌ ‘మహాన్‌’ ట్రైలర్‌ వచ్చేసింది!

దక్షిణాది సినిమా పరిశ్రమలో వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా మారారు నటుడు విక్రమ్‌(Vikram) . హిట్స్‌, ఫ్లాప్‌ లతో సంబంధం లేకుండా సినిమాల కోసం ఎంతైనా కష్టపడుతుంటారాయన. ఈ నేపథ్యంలో విక్రమ్‌ నటించిన తాజా చిత్రం 'మహాన్‌' (Mahaan).

Mahaan Trailer: అదరగొట్టిన తండ్రీకొడుకులు.. విక్రమ్‌ 'మహాన్‌' ట్రైలర్‌ వచ్చేసింది!
Mahaan
Basha Shek
|

Updated on: Feb 03, 2022 | 3:40 PM

Share

దక్షిణాది సినిమా పరిశ్రమలో వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా మారారు నటుడు విక్రమ్‌(Vikram) . హిట్స్‌, ఫ్లాప్‌ లతో సంబంధం లేకుండా సినిమాల కోసం ఎంతైనా కష్టపడుతుంటారాయన. ఈ నేపథ్యంలో విక్రమ్‌ నటించిన తాజా చిత్రం ‘మహాన్‌’ (Mahaan). కార్తిక్‌ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలో విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకోవడం ఇదే మొదటిసారి కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌ వేదికగా ఈనెల 10న ‘మహాన్‌’ సినిమా విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రబృందం. ఇందుకు తగ్గట్లే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు, పోస్టర్లు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. తాజాగా సినిమా ట్రైలర్ కూడా వచ్చేసింది.

ఇంతకు ముందు వచ్చిన టీజర్‌, తాజా ట్రైలర్‌ను చూస్తుంటే మద్యపాన నిషేధ పోరాటం చుట్టూ తిరిగే కథగా ‘మహాన్‌’ ను రూపొందించినట్లు తెలుస్తోంది. మద్యపాన నిషేధం కోసం పోరాడిన వీరుడి తనయుడైన విక్రమ్‌ అదే మద్యాన్ని గ్రామ ప్రజలకు ఎందుకు దొంగచాటుగా సరఫరా చేశాడు? ఉపాధ్యాయుడిగా ఉండి ఎందుకు ఇలా చేశాడు? ఇందులో ధ్రువ్‌ పాత్రేంటి? తదితర విషయాలు తెలుసుకోవాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే. తండ్రీ కొడుకులు ఒకే ఫ్రేములో కనిపించి ఆకట్టుకున్నారు. వీరితో పాటు తమిళ నటుడు బాబీసింహా, సిమ్రన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌.ఎస్‌. లలిత్‌ కుమార్‌ నిర్మాణ సారథ్య బాధ్యతలు నిర్వహిస్తుండగా, సంతోష్‌ నారాయణ్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

Also Read:Nayanthara: హైదరాబాద్‌ లో సందడి చేసిన నయనతార.. ఆ సినిమా షూటింగ్‌ కోసమేనా?

Dry Fruits: డ్రైఫ్రూట్స్ తిననంటూ పిల్లలు మారాం చేస్తున్నారా.. ఇలా ట్రై చేస్తే బెటర్..!

Viral Video: అందరి ముందు హీరో అవుదామనుకున్నాడు.. బొక్కబోర్లా పడ్డాడు. వైరల్‌ వీడియో..