Dry Fruits: డ్రైఫ్రూట్స్ తిననంటూ పిల్లలు మారాం చేస్తున్నారా.. ఇలా ట్రై చేస్తే బెటర్..!
Dry Fruits For Kids Health: పిల్లలకు రోజూ కొన్ని డ్రై ఫ్రూట్స్, నట్స్ తినిపించండి. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అలాగే పిల్లల ఎదుగుదలలోనూ ప్రభావం చూపిస్తుంది.
Dry Fruits For Kids Health: డ్రైఫ్రూట్స్, గింజలు పిల్లల ఆరోగ్యానికి(Health Tips) చాలా ముఖ్యమైనవి. డ్రైఫ్రూట్స్ తినడం వల్ల పిల్లల రోగనిరోధక శక్తి(Immunity) పెరగడంతోపాటు మెదడు బలపడుతుంది. డ్రైఫ్రూట్స్, నట్స్‌లో జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరం వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. అందుకే పిల్లల ఆహారంలో తప్పనిసరిగా డ్రై ఫ్రూట్స్, నట్స్‌ను చేర్చాలి. చాలా మంది పిల్లలు డ్రై ఫ్రూట్స్(Dry Fruits), నట్స్ తినరు. అలాంటి పరిస్థితిలో, మీరు మీ పిల్లల ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా వాటిని అందిచవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లల కోసం డ్రైఫ్రూట్స్‌తో అద్బుత రెసిపీని ఇలా తయారు చేయండి.. 1- డ్రైఫ్రూట్స్-నట్స్ బార్: పిల్లలు ఈ రెసిపీని చాలా ఇష్టపడతారు. ఇందులో జీడిపప్పు, పిస్తా, బాదం, డ్రై ఆప్రికాట్, ఎండుద్రాక్షలను గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు రోస్ట్ ఓట్స్ పౌడర్, డ్రైఫ్రూట్స్ ముక్కలు, తేనె వేసి పిండిని తయారు చేయండి. ఆ తరువాత దానిని ఒక ప్లేట్‌లో నిల్వ చేసి ముక్కలుగా కట్ చేసుకోండి.
2- డ్రైఫ్రూట్స్-నట్స్ పౌడర్: చిన్న పిల్లలకు డ్రైఫ్రూట్స్ తినిపించడానికి సులభమైన మార్గం జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్, పిస్తాలను మిక్సీలో గ్రైండ్ చేసి పొడి చేయడం. ఇప్పుడు దీన్ని పాలలో, గంజిలో, సెరెలాక్‌లో కలిపి పిల్లలకు తినిపించవచ్చు.
3- డ్రైఫ్రూట్స్-నట్స్ చాట్: మీరు పిల్లల కోసం వీటిని ఉపయోగించి చాట్ చేయవచ్చు. దీని కోసం వేరుశెనగ, అంజీర్, బాదం వంటి ఇతర డ్రై ఫ్రూట్‌లను ఒక గిన్నెలో వేసి, పఫ్డ్ రైస్, మఖానా వేసి కలపాలి. వీటిపై ఉప్పు, జీలకర్ర, చాట్ మసాలా వంటి తేలికపాటి మసాలా దినుసులు వేసి పిల్లలకు తినిపించండి.
గమనిక: ఈ కథనంలో అందించిన పద్ధతులు కేవలం సూచనలుగా భావించండి. ఇలాంటి పద్ధతులు పాటించే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
Also Read: Hair Care: జుట్టు నెరిసిపోవడానికి ఇదే కారణం.. కీలక విషయాలు వెల్లడించిన పరిశోధకులు..
Weight Loss Tips: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే.. ఈ డైట్ పాటించండి చాలు