Hair Care: జుట్టు నెరిసిపోవడానికి ఇదే కారణం.. కీలక విషయాలు వెల్లడించిన పరిశోధకులు..
Hair Care: సాధారణంగా జుట్టు(Hair) వృద్ధులకు నెరిసిపోతుంది. జట్టు నలుపు(Hair Colour) రంగు కాస్తా తెల్లబడిపోతుంటుంది. అయితే, ప్రస్తుత కాలంలో వృద్ధులు, యుక్తవయస్కులు
Hair Care: సాధారణంగా జుట్టు(Hair) వృద్ధులకు నెరిసిపోతుంది. జట్టు నలుపు(Hair Colour) రంగు కాస్తా తెల్లబడిపోతుంటుంది. అయితే, ప్రస్తుత కాలంలో వృద్ధులు, యుక్తవయస్కులు, పిల్లలు(Young Peoples) అనే తేడా లేకుండాపోతోంది. పిల్లల్లో కూడా జుట్ట నెరిసిపోవడం ప్రస్తుతం మనం చాలామందిలో గమనిస్తున్నాం. అయితే, పిల్లల్లో కూడా జుట్టు ఎందుకు నెరిసిపోతుందని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వెంట్రుకలు తెల్లగా మారడంపై కీలక విషయాలను గ్రహించారు. మరి ఆ విశేషాలంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సైన్స్ ఫోకస్ నివేదిక ప్రకారం.. జుట్టు నల్లబడటానికి కారణం మెలనిన్. ఇది జట్టుకు రంగునిచ్చే వర్ణద్రవ్యం. శరీరంలో ఇది లోపించినప్పుడు.. జుట్టు రంగు తెల్లగా మారుతుందట. ఇది మనుషులకే కాదు.. జంతువులకు కూడా వర్తిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇంకా డీప్‌గా వెళ్తే.. జుట్టు మూల భాగాల్లో మెలనోసైట్స్ అనే కణాలు ఉన్నాయి. ఇవి మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా జుట్టు నల్లగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి పెద్దయ్యాక, ఈ కణాలు కూడా బలహీనపడుతుంటాయి. ఫలితంగా మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అందుకే జుట్టు తెల్లబడటం మొదలవుతుంది. అయితే ప్రస్తుతం దీని ప్రభావం వృద్ధుల్లోనే కాదు, యువత, పిల్లల్లో కూడా కనిపిస్తోంది. దీనికి చాలా కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
నిపుణుల ప్రకారం.. శరీరంలో పోషకాల కొరత, ధూమపానం, అనారోగ్యం, ఒత్తిడితో కూడిన జీవితం మొదలైనవి జుట్టు రంగుపై ప్రభావం చూపుతాయి. ఇక న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్శిటీ ఇర్వింగ్ మెడికల్ సెంటర్ పరిశోధకులు చిన్న వయస్సులోనే జుట్టు నెరిసిపోవడానికి కారణం ఏమిటో అర్థం చేసుకోవడానికి పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. జుట్టు నెరసిపోవడానికి ఒత్తిడి ప్రధాన కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయం అధ్యయనంలో కూడా రుజువైంది. అధ్యయనం సమయంలో ప్రజల్లో ఒత్తిడి స్థాయిలి తగ్గితే.. జుట్టు మళ్లీ నల్లగా మారడం ప్రారంభమైంది. ఇది చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారట. అంటే పరిశోధన ప్రకారం.. శారీరక, మానసిక ఒత్తిడి జుట్టు రంగును ప్రభావితం చేస్తుందని సైంటిస్టులు తేల్చేశారు.
Also read:
Viral Video: లైవ్ డిబేట్‌లో పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..
Trs vs Bjp: బీజేపీకి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.. జీవన్ రెడ్డి ఫైర్..