Trs vs Bjp: బీజేపీకి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.. జీవన్ రెడ్డి ఫైర్..

Trs vs Bjp: రాజ్యాంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నేతలు దీక్షలు చేపట్టడంపై పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

Trs vs Bjp: బీజేపీకి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.. జీవన్ రెడ్డి ఫైర్..
Jeevan Reddy
Shiva Prajapati

|

Feb 03, 2022 | 12:01 PM

Trs vs Bjp: రాజ్యాంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నేతలు దీక్షలు చేపట్టడంపై పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలతో పాటు, కాంగ్రెస్ నేతలపైనా తీవ్ర విమర్శలు చేశారు. అంబేద్కర్‌ను అవమానించిన బీజేపీకి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి.. ఇంతపెద్ద దేశంలో దళితుల కోసం కేవలం రూ. 12 వేల కోట్లు మాత్రమే బడ్జెట్‌లో పెడతారా? అని ప్రశ్నించారు. ఇదేనా దళితులపై బీజేపికి ఉన్న ప్రేమ? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి – బండి సంజయ్ గల్లీలో కొట్లాడుతారు, ఢిల్లీలో దోస్తాన్ అంటారని విమర్శించారు.

అంబేద్కర్ ను అవమానించిన బీజేపీకి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? అని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. బీమ్ దీక్ష- ఆందోళన దీక్షలు చేస్తామన్న పార్టీలు అంబేద్కర్ ఆశయాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. దళితబంధు, రైతుబంధు లాంటి పథకాలు దేశం అంతటా అమలు జరిగే విధంగా రాజ్యాంగం రాసుకుందాం అనే మాటల్లో తప్పేముంది? అని ప్రశ్నించారు. బీజేపీది గాడ్సే ఇజం అయితే – టీఆరెస్ ది అంబెద్కర్ ఇజం అని అన్నారు. అత్తసొమ్ము అల్లునికి దానం చేసినట్లు.. ఎవరి సొమ్మని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్పరం చేస్తున్నారు? అని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. జపాన్, రష్యా, ఫ్రాన్స్ లో ప్రజల మనుగడకు అనుగుణంగా రాజ్యాంగం రాసుకున్నారని ఆయన గుర్తు చేశారు. వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వ్యక్తులకు మంత్రి పదవి ఇచ్చింది బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని కొత్తగా రాయలన్న కేసీఆర్ వ్యాఖ్యలను తాము సమర్దిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ అప్పుల గురించి మాట్లాడే బీజేపీ నాయకులు కేంద్రం చేసిన అప్పుల గురించి కూడా మాట్లాడాలని చురకలంటించారు జీవన్ రెడ్డి. 75 ఏళ్లలో 14మంది ప్రధానులు రూ. 56 లక్షల కోట్లు అప్పులు చేస్తే, ఒక్క మోడీనే రూ. 80లక్షల కోట్ల అప్పులు చేశారని, ఇది నిజం కాదా? అని ప్రశ్నించారు.

Also read:

Priyamani: యూట్యూబ్ చూడను.. కామెంట్స్ పట్టించుకోను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ప్రియమణి..

Omicron: ఒమిక్రాన్ టెస్టింగ్ కోసం మార్కెట్‌లోకి కొత్త RT-PCR కిట్‌.. 45 నిమిషాల్లోనే ఫలితం.. ఆమోదించిన ఐసీఎంఆర్

BJP Bhim Deeksha: కొనసాతున్న బీజేపీ భీం దీక్ష.. ఢిల్లీలో బండి సంజయ్ మౌన దీక్ష..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu