Priyamani: యూట్యూబ్ చూడను.. కామెంట్స్ పట్టించుకోను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ప్రియమణి..

దక్షిణాది చిత్రపరిశ్రమలలో ఎక్కువ పాపులారిటి ఉన్న హీరోయిన్లలో ప్రియమణి (Priyamani) ఒకరు. తెలుగులో పెళ్లైన కొత్తలో, యమదొంగ

Priyamani: యూట్యూబ్ చూడను.. కామెంట్స్ పట్టించుకోను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ప్రియమణి..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 03, 2022 | 11:56 AM

దక్షిణాది చిత్రపరిశ్రమలలో ఎక్కువ పాపులారిటి ఉన్న హీరోయిన్లలో ప్రియమణి (Priyamani) ఒకరు. తెలుగులో పెళ్లైన కొత్తలో, యమదొంగ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అందం, అభినయంతో సౌత్ ఇండస్ట్రీలోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో నటించి అగ్ర కథానాయికగా కొనసాగింది. వివాహం తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది ప్రియమణి. ఇటు సినిమాలు చేస్తూనే మరోవైపు.. టీవీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రియమణి.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో (Aha) భామ కలాపం (Bhama Kalapam) అనే సిరీస్ చేస్తుంది.

ఇటీవల విడుదలైన ఈ సిరీస్ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో భామ కలాపం సిరీస్ ప్రమోషన్స్‏లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న ప్రియమణి తనపై వచ్చే కామెంట్స్ గురించి స్పందించింది. ప్రియమణి మాట్లాడుతూ.. పెళ్లి అయిన తర్వాత కెరీయర్ పరంగా ఇప్పుడు బిజీ అయ్యాను. ఇప్పుడు నాకు చాలా సంతృప్తిగా అనిపిస్తోంది. వెబ్ సిరీస్, సినిమాలు వరుసగా చేస్తున్నాను. 2006 నుంచి 2012 వరకు చాలా బిజీగా ఉన్నాను. ఆ సమయంలో పండగ రోజుల్లో కూడా షూటింగ్ చేశాను. ఉన్నది ఒకటే జీవితం.. అది ఎంజాయ్ చేయాలనిపించింది. అందుకే పని తగ్గించుకుని ఫ్యామిలీ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తున్నాను.. నాకు నా కుటుంబం సపోర్ట్ ఉండడం వలన ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాను. కెరీయర్ పరంగా బిజీగా ఉన్నాను.. నాకు మంచి ఫ్యామిలీ సపోర్ట్ లభించినందుకు సంతోషంగా ఉన్నాను. సినిమాలు తగ్గడం వల్లే ప్రియమణి టీవీ షోస్ వరకు వెళ్లింది అనే విమర్శలు నా వరకు రాలేదు..

నేను టీవీ షోస్ చేస్తున్నప్పుడు వాటికి మంచి రేటింగ్స్ వస్తున్నాయని ప్రోత్సహించారే తప్ప ఎవరూ నిరాశపరచలేదు. కొందరు నెగిటివ్ కామెంట్స్ పెట్టోచ్చు. కానీ నేను వాటిని పట్టించుకోను. ఎందుకంటే అసలు యూట్యూబ్ చూడను. నా షోలకు సంబంధించిన ఎపిసోడ్ టెలికాస్ట్ అయినప్పుడు చూడడం కుదరనప్పుడు మాత్రమే యూట్యూబ్ చూస్తాను. చాలా మంది కామెంట్స్ కోసం యూట్యూబ్ చూస్తారు. కానీ నేను యూట్యూబ్ చూడను… ఎందుకంటే ప్రతి కామెంట్‏కు రియాక్ట్ కాలేదు. నన్ను అభినందించేవారిని నేను ఎంతగా ప్రేమిస్తానో.. నెగిటివ్ కామెంట్స్ చేసేవారిని అంతే ప్రేమిస్తాను అంటూ చెప్పుకొచ్చారు ప్రియమణి .

Also Read: DJ Tillu Movie: డీజే టిల్లు ట్రైలర్ ఈవెంట్‏లో పిచ్చి ప్రశ్నలు.. హీరోయిన్ అసహనం.. క్షమాపణలు చెప్పిన ప్రొడ్యూసర్..

Sehari Movie: అప్పుడే హర్ష నటనకు అభిమానిగా మారిపోయాను.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్..

Valimai: బైక్ స్టంట్స్ చేసి గాయపడినా అజిత్ షూటింగ్‏కు వచ్చేవారు.. ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కామెంట్స్ వైరల్..

Vanitha Vijaykumar: మా నాన్న నన్ను అడ్రస్ లేకుండా చేస్తానన్నారు.. నటి వనీతా షాకింగ్ కామెంట్స్..

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..