Akhanda: బాలయ్య ఫ్యాన్స్ అంటే మాములుగా ఉండదు మరీ.. అఖండ పై అభిమానాన్ని ఎలా చాటుకున్నాడో చూడండి..
నందమూరి నటసింహం బాలకృష్ణ (Blakrishna) అభిమానుల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడైనా సరే జై బాలయ్య అంటూ బాలకృష్ణ కోసం ఏం చేయడానికైనా
నందమూరి నటసింహం బాలకృష్ణ (Blakrishna) అభిమానుల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడైనా సరే జై బాలయ్య అంటూ బాలకృష్ణ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతుంటారు. ఇతర హీరోల ఫ్యాన్స్ కంటే.. బాలయ్య అభిమానుల లెక్క… తీరు వేరేగా ఉంటుంది. గుండెల నిండా ప్రేమ, అభిమానంతో తమ హీరో సినిమా వచ్చిందంటే చాలు థియేటర్ల వద్ద ఫ్యాన్స్ రచ్చ తెలిసిందే. ఇటీవల బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ (Akhanda) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో బాలకృష్ణ అభిమానులు ఫుల్ ఖిషి అయ్యారు.
ఇక అఖండ థియేటర్లలో కాసుల సునామి సృష్టించింది. కరోనా కేసులు పెరుగుతున్న అఖండ మాత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇదంతా పక్కన పెడితే.. ఓ అభిమాని బాలకృష్ణ పై ఉన్న ఇష్టాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తిరుపతిలో ఉండే బాలయ్య అభిమాని ఒకరు అఖండ పేరుతో ఓ హోటల్ స్టార్ట్ చేారు. తిరుపతిలో ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ది సిటీగా మారింది. బాలయ్య పై ఉన్న అభిమానాన్ని చాటుకున్న సదరు అభిమానిని హోటల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
అభిమానుల అభిమానానికి హద్దులే లేవు..❤️ ఇది తిరుపతి లో ఓ అభిమాని తన హోటల్ కి. ఏకంగా మన బాలయ్య సినిమా పేరు పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు.#NandamuriBalakrishna #Akhanda pic.twitter.com/kfKEBBTxaT
— Nandamuri Balakrishna™ (@NBK_Unofficial) February 2, 2022
Sehari Movie: అప్పుడే హర్ష నటనకు అభిమానిగా మారిపోయాను.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్..
Vanitha Vijaykumar: మా నాన్న నన్ను అడ్రస్ లేకుండా చేస్తానన్నారు.. నటి వనీతా షాకింగ్ కామెంట్స్..