Sehari Movie: అప్పుడే హర్ష నటనకు అభిమానిగా మారిపోయాను.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్..

హర్ష్‌ కనుమిల్లి (Harsh Kanumilli), సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో రూపొందిన‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘సెహరి’ (Sehari).

Sehari Movie: అప్పుడే హర్ష నటనకు అభిమానిగా మారిపోయాను.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్..
Sehari
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 03, 2022 | 9:03 AM

హర్ష్‌ కనుమిల్లి (Harsh Kanumilli), సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో రూపొందిన‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘సెహరి’ (Sehari). వర్గో పిక్చర్స్ ప‌తాకంపై రూపొందిన ఈ సినిమా టైటిల్‌తో పాటు, టీజర్, సాంగ్స్‌కు ఇప్ప‌టికే ప్రేక్షకుల నుంచి విశేష స్పంద‌న ల‌భించింది. ఫిబ్ర‌వ‌రి 11న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం సెహరి ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ క్రమంలో యంగ్ హీరో హర్ష్ నటనకు తాను అభిమానిగా మారిపోయాను అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక.

ఈ సందర్భంగా డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక మాట్లాడుతూ.. కోవిడ్ వ‌ల్ల సినిమా ఆల‌స్య‌మైంది. సెట్‌కు వెళ్ళేముందు వ‌ర్క్ షాప్ నిర్వ‌హించాం. అప్పుడే హీరో న‌ట‌న‌తో నేను అభిమానిగా మారిపోయాను. హీరో హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ బాగా పండింది. ప్రశాంత్‌ ఆర్ విహారి బాణీల వ‌ల్లే పాట‌లు ఇప్ప‌టికే హిట్ అయ్యాయి. ఎడిట‌ర్ ట్రైల‌ర్ బాగా క‌ట్ చేశాడు. అంద‌రి కృషితో అద్భుతంగా వ‌చ్చింది అని తెలిపారు.

అలాగే హీరో హర్ష్ కనుమిల్లి మాట్లాడుతూ.. సినిమా పోస్ట‌ర్ నాడు బాల‌య్య‌బాబుగారు వ‌చ్చి చిత్ర స్థాయిని పెంచారు. దానితో మాలో క‌సి పెరిగింది. అందుకే బాగా తీయ‌గ‌లిగాం. నేను రాసిన క‌థ‌ను ఊహించిన‌దానికంటే ద‌ర్శ‌కుడు సాగ‌ర్ అద్భుతంగా తీయ‌గ‌లిగాడు. త్వ‌ర‌లో పెద్ద ద‌ర్శ‌కుల జాబితాలో చేరిపోతాడ‌నే న‌మ్మ‌క‌ముంది. ఇక కోటిగారి న‌ట‌న‌లో కొత్త కోణం ఇందులో చూస్తారు. కామెడీ కూడా పండించారు. అద్వయ జిష్ణు రెడ్డి నా క్లాస్‌మేట్‌. ఇప్పుడు నాతో సినిమా తీశాడు. అలాగే సిమ్ర‌న్ అభిన‌యంతో సెకండాఫ్‌లో క‌ట్టిప‌డేస్తుంది. ఇంకా ఆర్హ‌, అనీషా కూడా బాగా న‌టించారు. ఇది ఆద్యంతం ఎంట‌ర్‌టైన్ చేసే సినిమా అని గ‌ట్టిగా చెప్ప‌గ‌ల‌ను. థియ‌ట‌ర్‌కు వ‌చ్చిన రెండు నిముషాల‌కే సెహ‌రి మిమ్మ‌ల్ని లీనం చేస్తుంది. ఒక‌టి రెండు సార్లు సినిమా చూసేలా చేస్తుంద‌ని న‌మ్మ‌క‌ముంద‌ని తెలిపారు.

Also Read: Vijaya Shanthi: చిన్నమ్మతో రాములమ్మ భేటీ.. తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

Childhood Rare Pic: ఆడపిల్ల వేషంలో దక్షిణాది సీనియర్ నటుడు.. తెలుగువారికి సుపరిచితులు ఎవరో గుర్తు పట్టారా. ..

Kareena Kapoor: తన కొడుకుతో ఓ హీరో సినిమా తీస్తాడని చెప్పిన కరీనా.. ఆ హీరో ఎవరంటే..

Priyamani: గ్రాండ్ గా సెకండ్ ఇన్నింగ్ షురూ చేసిన ‘ప్రియమణి’.. చీరలో ఆకట్టుకుంటున్న ఫొటోస్…

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే