Childhood Rare Pic: ఆడపిల్ల వేషంలో దక్షిణాది సీనియర్ నటుడు.. తెలుగువారికి సుపరిచితులు ఎవరో గుర్తు పట్టారా. ..
Childhood Rare Pic: సామాన్యులకైనా సెలబ్రెటీలకైనా బాల్యం అపురూపమే.. చిన్ననాటి జ్ఞాపకాలు(Childhood Memories) పదిలంగా దాచుకుంటారు.. గుర్తుకు వచ్చినప్పుడల్లా వాటిని తమ స్నేహితులతో సన్నిహితులతో..
Childhood Rare Pic: సామాన్యులకైనా సెలబ్రెటీలకైనా బాల్యం అపురూపమే.. చిన్ననాటి జ్ఞాపకాలు(Childhood Memories) పదిలంగా దాచుకుంటారు.. గుర్తుకు వచ్చినప్పుడల్లా వాటిని తమ స్నేహితులతో సన్నిహితులతో పంచుకుంటారు. ముఖ్యంగా సినీ హీరో, హీరోయిన్లు, క్రీడాకారులకు సంబంధించిన చిన్న తనంలో ఫోటోలను ఫ్యాన్స్ ఎంతో అపురూపంగా భావిస్తారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా జీవితం అనే నాటక రంగం నుంచి నిష్క్రమించినా వారికి చెందిన ఫోటోలను చూసినా, వారి గురించి విన్నాం.. మళ్ళీ మళ్ళీ తలచుకుంటూనే ఉంటాం..ఆలాంటి ఓ దక్షిణ చలన చిత్ర పరిశ్రమకు చెందిన సూపర్ స్టార్.. చిన్న తనంలోని ఓ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
‘నడిగర్ తిలకం’ శివాజీ గణేశన్ (Sivaji Ganesan) సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటులు. ఏడేళ్ల వయస్సులోనే నటనకు శ్రీకారం చుట్టిన శివాజీ గణేశన్ వెండి తెరపై అడుగు పెట్టడానికి ముందు చిన్న చిన్న డ్రామా కంపెనీలలో పనిచేసేవారు. 10 ఏళ్ల వయస్సులో తిరుచిరాపల్లి లో సాంగ్లీయాండ్రపురంలో ‘శ్రీ బాలగానసభ’ అనే నాటకాల కంపెనీలో చేరి ప్రదర్శనలు ఇచ్చేవారు. బాలగానసభ నిర్వాహకులు పొన్నుసామి పిళ్ళై తన తొలి గురువు అని శివాజీ గర్వంగా చెప్పుకునేవారు. అక్కడ శివాజీ గణేశన్ కు తన కన్నా మూడేళ్లు పెద్దవాడైన కాకా రాధా కృష్ణన్ అనే మరో బాలనటుడితో పరిచయం ఏర్పడింది. కాకా రాధాకృష్ణన్ శివాజీ గణేషన్ మంచి స్నేహితులయ్యారు.
10 ఏళ్ల వయస్సులో ఒకానొక స్టేజి డ్రామాలో శివాజీ గణేషన్ (ఎడమ ప్రక్కన), కాకా రాధాకృష్ణన్ ల అరుదైన చిత్రం. కాకా రాధాకృష్ణన్ సహకారం తో శివాజీ గణేషన్ చిత్రరంగ ప్రవేశం చేశారు. ఇద్దరూ కలిసి ‘మనోహర (1954)’, దేవర్ మగన్ (1992) చిత్రాలలో నటించారు. అయితే శివాజీకి హీరో కన్న హీరోయిన్ వేషం రామాయణంలో సీత రూపంలో వచ్చింది. ఆడవేషమైనా అందమైన హావభావాలతో నాటకంలోని సీత పాత్రను అవలీలగా పోషించి ప్రేక్షకుల మెప్పుపొందారు.
శివాజీ నేషనల్ ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని మహానటుడిగా ఎదిగారు. మూడువందలకు పైగా చిత్రాలలో నటించిన శివాజీ గణేశన్ తెలుగు ప్రేక్షకులు సుపరిచితులే. తెలుగులో పరదేశి, పెంపుడు కొడుకు, మనోహర, పరాశక్తి, బొమ్మలపెళ్ళి, పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం, సంపూర్ణ రామాయణం, రామదాసు, భక్త తుకారాం, జీవన తీరాలు, చాణక్య చంద్రగుప్త, నివురుగప్పిన నిప్పు, విశ్వనాథ నాయకుడు వంటి అనేక చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించారు.
Also Read: