Vizag: ఉపాధినిస్తుంది అనుకున్న వృత్తి ఉసురు తీసింది.. చేప దాడిలో మత్యకారుడు మరణం
వేటలో భాగంగా మత్య్సకారులు చేపల కోసం తోటి స్నేహితులతో కలిసి సముద్రంలోకి వల వేశారు. బాగా బరువు అనిపించడంతో పెద్ద చేప చిక్కింది అనుకుని.. వలను దగ్గర లాగడం మొదలుపెట్టారు.
—ఉపాధినిస్తుంది అనుకున్న వృత్తి ఉసురు తీసింది..
—కడలి పుత్రుని కుటుంబంలో కల్లోలం…
—సాగర తీర నగరం విశాఖలో చేప దాడిలో మత్యకారుడు మరణించడతో విషాదం
Kommu Konam Fish: విశాఖలోని పరవాడ మండలం(Paravada Mandal ) ముత్యాలమ్మపాలెంలో విషాదం చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన జోగన్న తన తోటి ఐదుగురు మత్స్యకారులతో కలిసి గ్రూప్ గా సముద్రంలోకి వేటకు వెళ్లారు. వేటలో భాగంగా చేపల కోసం తోటి స్నేహితులతో కలిసి సముద్రంలోకి వల వేశారు. బాగా బరువు అనిపించడంతో పెద్ద చేప చిక్కింది అనుకుని.. వలను దగ్గర లాగడం మొదలుపెట్టారు. వారి ప్రయత్నం ఫలించింది. అనుకోకుండా వలలో గట్టిగానే చేపలు పడ్డాయి. ఆనందంతో వలను త్వరగా లాగడం స్పీడ్ చేశారు. వల పడవ దగ్గరకీ వచ్చేసరికి కొమ్ము కోణం అనే జాతి చేప వలలో ఉంది. ఆ చేపను పడవలోకి వేసేందు అలిమి కాకపోవడంతో.. బాగా బరువున్న వలను పడవలోకి ఎక్కించేందుకు నీళ్లలోకి దిగి కింద నుంచి సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు జోగన్న అనే మత్స్యకారుడు(Fishermen). చేప నీటీలో ఉండటం, కోణం చేప ముక్కు పొడవుగా ఉండటంతో నీళ్లలో ఉన్న జోగన్నపై ఒక్కసారిగా అటాక్ చేసింది. దా౦తో చేప ముక్కు మత్యకారుడు జోగన్న కడుపులోకి దూసుకుపోయింది. రక్త స్రావం అవడంతో కొన్ని నిమిషాల వ్యవధిలోనే జోగన్న మరణించాడు. దీంతో మృతుడు జోగన్న కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తోటి మత్స్యకారులనుంచి వివరాలు సేకరించి.. దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన వినూత్నమైన పడవ.. అనుమానంతో మత్స్యకారులు చెక్ చేయగా…
ఎరువుల లోడ్ అనుకుంటే పొరబడినట్లే.. అస్సలు యవ్వారం తెలిస్తే వామ్మో అంటారు