AP: సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన వినూత్నమైన పడవ.. అనుమానంతో మత్స్యకారులు చెక్ చేయగా…

నెల్లూరు జిల్లా ఇస్కపల్లి సముద్ర తీరానికి వెదురు బొంగులతో తయారు చేసిన పడవ కొట్టుకువచ్చింది. పడవ అనుమానాస్పదంగా ఉండటంతో.. స్ధానిక మత్స్యకారులు దగ్గరకు వెళ్లి పరిశీలించారు.

AP: సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన వినూత్నమైన పడవ.. అనుమానంతో మత్స్యకారులు చెక్ చేయగా...
Mysterious Boat
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 02, 2022 | 3:31 PM

Suspected Boat: సముద్ర తీరానికి పడవలు కొట్టుకుని రావడం కామన్.  అలల తాకిడి ఎక్కువ ఉన్నప్పుడు లాక్‌లు తెగిపోయి చిన్న, చిన్న ఓడలు… పడవలు తీరాలకు కొట్టుకువస్తాయి. అయితే  నెల్లూరు జిల్లా(Nellore District)లో సముద్ర తీరానికి కొట్టుకువచ్చిన ఓ పడవ మాత్రం.. మిస్టరీగా మారింది. ఆ పడవలో కనిపించినవి చూసి.. మత్సకారులకు కాస్త వింతగా అనిపించింది. అల్లూరు మండలం(Allur Mandal) ఇస్కపల్లి సముద్ర తీరానికి సదరు పడవ కట్టుకొచ్చింది.  వెదురు బొంగులతో ఆ పడవ నిర్మాణం చేశారు. పడవ కొత్తగా ఉండటంతో.. స్ధానిక మత్స్యకారులు దగ్గరకు వెళ్లి పరిశీలించారు. ఈ పడవ లోపల బుద్దుడు విగ్రహం, శివలింగం ఉండటాన్ని గుర్తించారు. వెంటనే  మెరైన్ పోలీసులకు ఫోన్ చేసి.. వివరాలు చెప్పారు. మత్సకారుల సమాచారంతో ఇస్కపల్లి సముద్ర తీరానికి వచ్చిన మెరైన్ పోలీసులు ఆ పడవను స్వాధీనం చేసుకున్నారు. ఇది శ్రీలంకకు చెందిన పడవ అని మత్స్యకారులు అనుమానిస్తున్నారు. మెరైన్ పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. అలల ఉధృతి ఎక్కువై.. పడవ  ఇలా తీరానికి కొట్టుకుని వచ్చి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ పడవ విషయం చుట్టుపక్కల ప్రాంతాల జనాలకు తెలియడంతో అక్కడికి వచ్చి ఈ కొత్తరకం పడవను ఆసక్తిగా చూసి వెళుతున్నారు. గతంలో కూడా ఇలా పడవలు కొట్టుకువచ్చిన దాఖలాలు ఉన్నాయని  స్థానికులు చెబుతున్నారు. విచారణలో పూర్తి విషయాలు వెల్లడవ్వనున్నాయి.

Also Read:  AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే.. స్పష్టం చేసిన కేంద్రం