AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valimai: బైక్ స్టంట్స్ చేసి గాయపడినా అజిత్ షూటింగ్‏కు వచ్చేవారు.. ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కామెంట్స్ వైరల్..

మోస్ అవైటెడ్ చిత్రం వలిమై. తమిళ్ స్టార్ హీరో అజిత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Valimai: బైక్ స్టంట్స్ చేసి గాయపడినా అజిత్ షూటింగ్‏కు వచ్చేవారు.. ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కామెంట్స్ వైరల్..
Rajitha Chanti
|

Updated on: Feb 03, 2022 | 8:54 AM

Share

మోస్ అవైటెడ్ చిత్రం వలిమై (Valimai). తమిళ్ స్టార్ హీరో అజిత్ (Ajith) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించిన ఈ సినిమా హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేయాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్‌ సంస్థ, బేవ్యూ ప్రాజెక్ట్స్‌ బ్యానర్లపై ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా బోనీ కపూర్ మాట్లాడుతూ.. “కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలతో పాటు సినీ రంగం కూడా నానా ఇబ్బందులు ఎదుర్కొంది. కాస్త సానుకూల వాతావరణం ఏర్పడటంతో ఫిబ్రవరి 24న విడుదలకు ప్లాన్ చేసాము. తమిళ్ తో పాటు హిందీ, తెలుగు, కన్నడ కూడా ఒకే సారి విడుదల చేస్తున్నాం. అజిత్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే గ్రాండ్ విజువల్స్ తో చిత్రం ఆద్ధ్యంతం ఉంటుంది. తెలుగులో ‘ఖాకి’గా విడుదల అయిన కార్తీ తమిళ సినిమా ‘థీరన్ అధిగారం ఒండ్రు’ సినిమాకు దర్శకత్వం వహించిన హెచ్. వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అజిత్‌తో ఆయనకు రెండో చిత్రమిది. అజిత్ క్రేజ్ కి తగ్గట్లుగా వినోద్ ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ , ఛేజింగ్ సీన్లు డిజైన్ చేశారు. ఛేజింగ్ సీన్లు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఓ పవర్ ఫుల్ పోలీస్ గా అజిత్ కనిపిస్తాడు. హీరో అజిత్‌కి బైక్స్, బైక్ రైడ్స్ అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డూప్ సహాయం లేకుండా తన సినిమాల్లో స్టంట్స్, ముఖ్యంగా బైక్ రైడింగ్ సీన్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు షూటింగులో గాయపడ్డారు కూడా! అయినా సరే ఏ మాత్రం లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొన్నాడు. యాక్షన్ సీన్స్ చేయడానికి ఎంత కష్టపడ్డారు? అనేది చిత్రం చూసిన తరువాత ఆడియ‌న్స్‌కు అర్థం అవుతుంది. ఇక ఈ చిత్రంలో తెలుగు హీరో కార్తికేయ కీలక మైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా, అయన తన శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకున్నారు” అన్నారు. ఈ చిత్రంలో కార్తికేయ గుమ్మడకొండ, హ్యుమా ఖురేషి, గుర్బాని జడ్జి, సుమిత్ర, యోగిబాబు, సెల్వ, జి ఎం సుందర్, అచ్యుత్ కుమార్, చైత్ర రెడ్డి, తదితరులు నటిస్తున్నారు.

Also Read: Vijaya Shanthi: చిన్నమ్మతో రాములమ్మ భేటీ.. తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

Childhood Rare Pic: ఆడపిల్ల వేషంలో దక్షిణాది సీనియర్ నటుడు.. తెలుగువారికి సుపరిచితులు ఎవరో గుర్తు పట్టారా. ..

Kareena Kapoor: తన కొడుకుతో ఓ హీరో సినిమా తీస్తాడని చెప్పిన కరీనా.. ఆ హీరో ఎవరంటే..

Priyamani: గ్రాండ్ గా సెకండ్ ఇన్నింగ్ షురూ చేసిన ‘ప్రియమణి’.. చీరలో ఆకట్టుకుంటున్న ఫొటోస్…