SSMB28: మహేష్ బాబు లేకుండానే సినిమా షూరు చేసిన త్రివిక్రమ్.. స్పెషల్ అట్రాక్షన్‌గా నమ్రత..
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu).. డైరెక్టర్ పరశురామ్ కాంబోలో వస్తున్న చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata).

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu).. డైరెక్టర్ పరశురామ్ కాంబోలో వస్తున్న చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ మూవీపై అంచనాలను పెంచేశాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత మహేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తుండేవి. ఈ రోజు SSMB28 సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
ఈ వేడుకకు మహేష్ బాబు హాజరుకాకపోవడంతో నమ్రత శిరోద్కర్ పాల్గోన్నారు. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే నటించనుంది. ఈ చిత్రాన్ని శ్రీమతి మమత సమర్పణలోటాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధా కృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఉదయం 9 గంటల 53 నిమిషాలకు చిత్రం పూజా కార్యక్రమాలతో , ఆత్మీయ అతిథుల నడుమ వైభవంగా ప్రారంభమయింది. చిత్ర కథానాయిక పూజ హెగ్డే పై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి శ్రీమతి నమ్రత శిరోద్కర్ క్లాప్ నిచ్చారు. ప్రముఖ పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచాన్ చేశారు.
సూపర్‌స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందనుందని ప్రకటన వచ్చిన నాటినుంచి చిత్రం పై ఉత్సుకత ఇటు సినీ వర్గాల్లోనూ, అటు ప్రేక్షక వర్గాల్లోనూ నానాటికీ పెరుగుతూ వస్తున్నాయి. వీటిని మరింతగా నిజo చేస్తూ ఈ చిత్రానికి సంభందించి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మహేష్‌బాబు , త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలు, మరిన్ని ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తామని చిత్ర నిర్మాత ఎస్. రాధా కృష్ణ తెలిపారు.
Sehari Movie: అప్పుడే హర్ష నటనకు అభిమానిగా మారిపోయాను.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్..
Vanitha Vijaykumar: మా నాన్న నన్ను అడ్రస్ లేకుండా చేస్తానన్నారు.. నటి వనీతా షాకింగ్ కామెంట్స్..






