Vanitha Vijaykumar: మా నాన్న నన్ను అడ్రస్ లేకుండా చేస్తానన్నారు.. నటి వనీతా షాకింగ్ కామెంట్స్..

దేవి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు వనీతా విజయ్ కుమార్. ఈ మూవీ తర్వాత వనీతా తెలుగులో మళ్లి సినిమాలు

Vanitha Vijaykumar: మా నాన్న నన్ను అడ్రస్ లేకుండా చేస్తానన్నారు.. నటి వనీతా షాకింగ్ కామెంట్స్..
Vanitha
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 03, 2022 | 7:52 AM

దేవి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు వనీతా విజయ్ కుమార్. ఈ మూవీ తర్వాత వనీతా తెలుగులో మళ్లి సినిమాలు చేయకపోయిన.. తమిళంలో మాత్రం పలు చిత్రాల్లో నటించి ఆకట్టుుకుంది. మొదటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది వనీతా. సినిమాల కంటే .. వనీత వివాదాస్పద వ్యాఖ్యలు.. ఇతర నటీనటులతో గొడవలు కారణంగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉండేది. ఇక తమిళ్ బిగ్ బాస్ షోలో వనీతా చేసిన రచ్చ గురించి తెలిసిందే. తమిళ్ సీనియర్ నటీనటులు విజయ్ కుమార్, మంజుల గారి కూతురు వనీతా. సెలబ్రెటీల కుటుంబంలో పుట్టి ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న వనీతా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. చిన్న వయసులోనే పెళ్లి కావడం.. మనస్పర్థలతో విడిపోవడం అలా మూడు పెళ్లిళ్లు పెటాకులే అయ్యాయి.

అయితే ఇటీవల ఓ ఇంటర్వూలో పాల్గోన్న వనీత తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కోన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. వనీతా విజయ్ కుమార్ మాట్లాడుతూ… “మా చాలా కష్టపడి స్టార్ హోదా సంపాదించుకుంది. మాకోసం రాత్రింబవల్లు షూటింగ్స్ చేసి డబ్బులు కూడబెట్టింది. మేము ముగ్గురం కూతుళ్లం. ఏదైనా మాకు సమానంగా ఇచ్చేంది. కానీ నాన్న నాకు ఏదీ ఇవ్వకూడదనుకున్నారు. అమ్మ చనిపోయాక ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నాకు ఇవ్వలేదు. నామీదే కేసులు పెట్టారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు వరకు వెళ్లాను. తమిళనాడులో నాకు అడ్రస్ లేకుండా చేస్తానని నాన్న నాతో ఛాలెంజ్ చేశాడు. కానీ ఇప్పుడు తమిళ్ ప్రజలు దగ్గరకు తీసుకున్నారు.. అందుకు సంతోషంగా ఉన్నాను.. ” అంటూ చెప్పుకొచ్చింది వనితా.

మా కుటుంబంలో ఎవరిని అడిగినా. వాళ్లు నేను ఆ కుటుంబంలో లేనని చెబుతుంటారు. వాళ్లకు నామీద అంత కోపం ఎందుకు ఉందో నాకు తెలియదు. ఒకసారి నాన్న పోలీసులను పిలిపించి మా అమ్మ ఇంట్లోంచి నన్ను గెంటేశారు. కట్టుబట్టలతో పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాను.. ఇక పెళ్లి విషయానికి వస్తే చిన్న వయసులో వివాహం చేయడం వల్లే నా పెళ్లిళ్లు ఎంతో కాలం నిలవలేదు అంటూ ఎమోషనల్ అయ్యింది వనీతా విజయ్ కుమార్.

Also Read: Vijaya Shanthi: చిన్నమ్మతో రాములమ్మ భేటీ.. తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

Childhood Rare Pic: ఆడపిల్ల వేషంలో దక్షిణాది సీనియర్ నటుడు.. తెలుగువారికి సుపరిచితులు ఎవరో గుర్తు పట్టారా. ..

Kareena Kapoor: తన కొడుకుతో ఓ హీరో సినిమా తీస్తాడని చెప్పిన కరీనా.. ఆ హీరో ఎవరంటే..

Priyamani: గ్రాండ్ గా సెకండ్ ఇన్నింగ్ షురూ చేసిన ‘ప్రియమణి’.. చీరలో ఆకట్టుకుంటున్న ఫొటోస్…

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..