Omicron: ఒమిక్రాన్ టెస్టింగ్ కోసం మార్కెట్‌లోకి కొత్త RT-PCR కిట్‌.. 45 నిమిషాల్లోనే ఫలితం.. ఆమోదించిన ఐసీఎంఆర్

కొత్త RT-PCR కిట్ Omicron వేరియంట్‌ను కచ్చితంగా గుర్తిస్తుందంట. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) చెన్నై నుంచి కొత్త RT-PCR కిట్‌ను ఆమోదించింది. ఈ కిట్ కేవలం 45 నిమిషాల్లో..

Omicron: ఒమిక్రాన్ టెస్టింగ్ కోసం మార్కెట్‌లోకి కొత్త RT-PCR కిట్‌.. 45 నిమిషాల్లోనే ఫలితం.. ఆమోదించిన ఐసీఎంఆర్
Krivida Novus Rt Pcr
Follow us

|

Updated on: Feb 03, 2022 | 11:55 AM

Omicron: ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్ష జరుగుతుంది. అయితే నమూనా తీసుకోవడం నుంచి నివేదిక వరకు ప్రక్రియ కనీసం 5-7 రోజులు పడుతుంది. అది పూర్తి చేయడానికి దాదాపు రూ. 5 వేలు ఖర్చు అవుతుంది. కానీ, ఇక నుంచి ఇలాంటి ఎదురుచూపులకు స్వస్తి పలకవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే కొత్త RT-PCR కిట్ ఒమిక్రాన్(Omicron) వేరియంట్‌ను కచ్చితంగా గుర్తిస్తుందంట. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) చెన్నై నుంచి కొత్త RT-PCR కిట్‌ను ఆమోదించింది. ఈ కిట్ కేవలం 45 నిమిషాల్లో డెల్టా, ఒమిక్రాన్‌తో సహా కరోనా(Coronavirus) అన్ని వేరియంట్‌లను గుర్తించడంలో విజయవంతం అయినట్లు ప్రకటించారు. దీని పేరు క్రివిడా నోవస్ కిట్(KRIVIDA Novus RT-PCR) కిట్‌గా వ్యవహరించనున్నారు.

ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది?

ImmuGenix బయోసైన్స్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్, కిట్ తయారీదారు అయిన డాక్టర్ నవీన్ కుమార్ వెంకటేశన్ ప్రకారం, క్రివిడా నోవస్ కిట్ S-Gene టార్గెట్ ఫెయిల్యూర్ స్ట్రాటజీ ద్వారా Omicron వేరియంట్‌ను గుర్తిస్తుంది. కిట్ ఒమిక్రాన్ (B.1.1.529) BA.1, BA.2, BA.3 అన్ని ఉప-వేరియంట్‌లను కూడా గుర్తించగలదు.

S-Gene Target Failure Strategy అంటే ఏమిటి?

వైరస్‌లో ఉన్న ఎస్-జీన్ ద్వారా మాత్రమే ఒమిక్రాన్ గుర్తిస్తుంది. చాలా మంది శాస్త్రవేత్తలు ఒమిక్రాన్‌లో ఎస్-జీన్ లేదని పేర్కొన్నారు. ఒక వ్యక్తి వారి నమూనాలో S-జీన్‌ను కోల్పోయినట్లయితే, వారు Omicron వ్యాధి బారిన పడ్డట్లేనని వారు తెలిపారు. S-జీన్ నమూనాలో ఉంది. రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా ఉంది. కరోనా మరొక రూపాంతరం ఇన్ఫెక్షన్ ఉందని దీని అర్థం. క్రివిడా నోవస్ RT-PCR సంబంధిత S-జన్యువు, 5 విభిన్న జన్యువులను గుర్తిస్తుంది. ImmuGenix బయోసైన్స్ సహకారంతో ఈ కిట్ తయారు చేసినట్లు తెలిపారు.

పాత RT-PCR కిట్‌లో ఎన్ని వేరియంట్‌లను కనుగొనేందుకు వీలుంది

క్రియా మెడికల్ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ హెడ్ డాక్టర్ షణ్ముగప్రియ ప్రకారం, కొత్త RT-PCR కిట్ నాలుగు SARS-CoV-2 జన్యువులను, ఒక మానవ జన్యువును గుర్తించింది. అన్ని పాత RT-PCR కిట్‌లు SARS-COV-2 మూడు జన్యువులను గుర్తించనున్నాయి.

కొత్త కిట్‌తో టెస్టింగ్‌లో మార్పులు?

ఇప్పటి వరకు పాత కిట్‌తో చేసిన పరీక్షనే ఈ కిట్‌తో కూడా చేయవచ్చని డాక్టర్ వెంకటేశన్ తెలిపారు. నమూనా కోసం, మీరు ముక్కు లేదా గొంతు నుంచి శ్లేష్మాన్ని తీసుకొని కిట్ సహాయంతో పరీక్షించవచ్చు. కాగా, ఈ కొత్త కిట్ ఇప్పటివరకు మార్కెట్‌లో విక్రయిస్తున్న అన్ని RT-PCR కిట్‌లతో పోలిస్తే తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read: Corona: కరోనాని ఓడిస్తున్న Zycov-D.. మూడు డోసులకి కేవలం ఎంతంటే..?

Omicron sub-variant: హడలెత్తిస్తున్న ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌.. షాకింగ్ విషయం చెప్పిన డెన్మార్క్‌ సైంటిస్టులు

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో