China vs India: చైనాకు గాల్వాన్ దెబ్బ గట్టిగానే తగిలింది.. షాకింగ్ రిపోర్ట్ వెల్లడించిన ఆస్ట్రేలియా మీడియా..

China vs India: 2020 సంవత్సరంలో సరిహద్దు ప్రాంతంలో భారత్-చైనా(China vs India) బలగాల మధ్య గాల్వాన్‌లో(Galwan Violence) జరిగిన ఘర్షణలో చైనా(China) అధికారికంగా ప్రకటించిన

China vs India: చైనాకు గాల్వాన్ దెబ్బ గట్టిగానే తగిలింది.. షాకింగ్ రిపోర్ట్ వెల్లడించిన ఆస్ట్రేలియా మీడియా..
Follow us

|

Updated on: Feb 03, 2022 | 1:35 PM

China vs India: 2020 సంవత్సరంలో సరిహద్దు ప్రాంతంలో భారత్-చైనా(China vs India) బలగాల మధ్య గాల్వాన్‌లో(Galwan Violence) జరిగిన ఘర్షణలో చైనా(China) అధికారికంగా ప్రకటించిన దానికంటే ఎక్కువే నష్టోయింది. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియాకు(Australia) చెందిన ‘ది క్లాక్సన్’ మీడియా నివేదిక వెల్లడించింది. ఘర్షణ సందర్భంగా నదిలో పడి చాలామంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ఈ అంశంపై చైనాకు చెందిన పలు పరిశోధనలు, బ్లాగర్స్ విశ్లేషణలను ‘ది క్లాక్సన్’’ ఉటంకించింది. వాస్తవానికి చైనా భారీ నష్టం జరిగిందనే వార్తలు గతంలోనే వచ్చాయి. కానీ, చైనా మాత్రం పెద్దగా నష్టం జరగలేదంటూ ప్రపంచానికి వాస్తవాలను తెలుపకుండా వచ్చింది. అయితే, ది క్లాక్సన్ వార్తల ఆధారంగా సోషల్ మీడియా పరిశోధకుల బృందం అందించిన సాక్షాల ద్వారా చైనాకు భారీగానే నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

కనీసం 38 మంది పీఎల్‌ఏ సైనికులు మృతి.. సోషల్ మీడియా రీసెర్చ్‌ను ఉటంకిస్తూ ఆస్ట్రేలియా వార్తాపత్రిక ఒక పరిశోధనాత్మక నివేదికను ప్రచురించింది. ఈ పరిశోధన సమయంలో, చైనీస్ వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా అకౌంట్లతో పాటు డజన్ల కొద్దీ బ్లాగులు, హ్యాండిల్‌లను పరిశోధించారు. ఈ ఘర్షణలో నలుగురు సైనికులు మాత్రమే మరణించారని చైనా ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించింది. కానీ ‘ది క్లాక్సన్’ నివేదిక ప్రకారం.. కనీసం 38 మంది PLA సైనికులు గాల్వాన్‌లోని నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. నదిలో కొట్టుకుపోయిన వారిలో జూనియర్ సార్జెంట్ వాంగ్ జురాన్ కూడా ఉన్నాడు. జురాన్ మరణాన్ని చైనా ధృ‌వీకరించింది. అయితే, గాల్వాన్ లోయలో ఘర్షణ జరిగిన రోజు రాత్రి చైనా బృందానికి కమాండర్‌గా ఉన్న కల్నల్ కవి ఫాబావో కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఆస్ట్రేలియా మీడియా చెబుతోంది. దీనిని చైనా ప్రభుత్వం ధృవీకరించలేదు.

అమరులైన 20 మంది భారత సైనికులు.. 15 జూన్ 2020న గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన భీకర ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. ఆ తర్వాత తూర్పు లడఖ్‌లోని సంఘర్షణ ప్రదేశాలలో రెండు దేశాలకు చెందిన బలగాలు భారీ ఆయుధాలతో మోహరించాయి. భారత సైన్యంతో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు చైనా సైనికాధికారులు, సైనికులు మరణించారని ఫిబ్రవరి 2021లో చైనా అధికారికంగా అంగీకరించింది. కానీ, చనిపోయిన చైనా సైనికుల సంఖ్య ఎక్కువగా ఉందని విపరీతంగా ప్రచారం జరిగింది. అయినప్పటికీ చైనా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక గాల్వాన్‌లో వీరమరణం పొందిన 20 మంది సైనికుల పేర్లను ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నంపై చెక్కించింది భారత ప్రభుత్వం.

Also read:

Viral Video: లైవ్ డిబేట్‌లో పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..

Trs vs Bjp: బీజేపీకి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.. జీవన్ రెడ్డి ఫైర్..

Hidden Treasure: రెచ్చిపోయిన దొంగలు.. గర్భగుడికి సొరంగ మార్గం.. వైరల్ అవుతున్న వీడియో..!