AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: లైవ్ డిబేట్‌లో పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..

Viral Video: సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి సంబంధించి అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు మీడియా సంస్థలు మేధావులు, పొలిటికల్ లీడర్స్‌తో డిబేట్‌లు,..

Viral Video: లైవ్ డిబేట్‌లో పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..
Shiva Prajapati
|

Updated on: Feb 03, 2022 | 1:16 PM

Share

Viral Video: సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి సంబంధించి అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు మీడియా సంస్థలు మేధావులు, పొలిటికల్ లీడర్స్‌తో డిబేట్‌లు, చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తాయనే విషయం తెలిసిందే. ఈ డిబేట్స్‌లో జరిగే చర్చలు కొన్నిసార్లు అర్ధవంతంగా సాగితే.. మరికొన్నిసార్లు హింసాత్మకంగా జరుగుతుంటాయి. చర్చాకార్యక్రమంలో పాల్గొన్న వారి మధ్య బేదాభిప్రాయాలు.. పరస్పర దాడులు చేసుకునే పరిస్థితికి దారితీస్తాయి. చర్చా కార్యక్రమాల్లో నేతలు, మేధావులు ఎంత వాడీవాడేగా మాట్లాడుతారో మనందరికీ తెలుసు. అయితే, కొన్నికొన్ని సార్లు వారు నియంత్రణ కోల్పోతుంటారు. ఎదుటి వారిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తారు. కొన్ని సందర్భాల్లో భౌతికదాడులకు కూడా పాల్పడుతుంటాయి. తాజాగా ఇలాంటి పరిస్థితికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

వివరాల్లోకెళితే.. ఓ టీవీ ఛానెల్ లైవ్ డిబేట్ నిర్వహించింది. ఏదో అంశంపై సీరియస్‌గానే చర్చ సాగిస్తోంది. ఈ చార్చా కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు.. తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. ఈ క్రమంలో వక్తల మధ్య బేధాబిప్రాయాలు తారాస్థాయికి చేరాయి. మాటలు కోటలదు దాటాయి. చివరికి ఒకరిపై మరొకరు పరస్పరం భౌతిక దాడులకు దిగారు. లైవ్ నడుస్తుండగానే.. ఇద్దరు వక్తలు పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. గల్లాలు పట్టుకుని గుంజుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. మరో వక్త, యాంకర్ వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారిద్దరూ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఒక రేంజ్‌లో దెబ్బలాడుకున్నారు. లైవ్ డిబేట్ కావడంతో.. ఇదంతా టీవీలో ప్రసారం అయ్యింది. కాగా, దీనికి సంబంధించిన వీడియోను పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్ అయ్యింది. మరీ ఇలా తయారయ్యారేంట్రా అని నెటిజన్లు ఫన్నీ సెటైర్లు వేస్తూ.. విమర్శలు కురిపిస్తున్నారు. ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నప్పు స్వీయనియంత్రణ అవసరం అని, అర్ధవంతమైన చర్చ చేయాలని హితవుచెబుతున్నారు.

Also read:

Trs vs Bjp: బీజేపీకి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.. జీవన్ రెడ్డి ఫైర్..

Hidden Treasure: రెచ్చిపోయిన దొంగలు.. గర్భగుడికి సొరంగ మార్గం.. వైరల్ అవుతున్న వీడియో..!

Cotton Price Today: ఆల్ టైం రికార్డ్ స్థాయికి తెల్లబంగారం ధర.. క్వింటాల్ పత్తి ధర రూ. 10,759..