అఖిల్ సరసన బన్నీ హీరోయిన్..?

‘మిస్టర్ మజ్ను’తో ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేని అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రంపై మరింత జాగ్రత్త తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే అఖిల్ తన తర్వాత సినిమాను బొమ్మరిల్లు భాస్కర్‌తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈనెల 26 నుంచి మొదలు కానుంది. దాదాపు సినిమాలో నటించే ప్రముఖ తారాగణం కూడా ఫిక్స్ అయ్యారు. కానీ ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇంకా సెట్ కాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం స్టార్ […]

  • Ravi Kiran
  • Publish Date - 7:43 pm, Fri, 21 June 19
అఖిల్ సరసన బన్నీ హీరోయిన్..?

‘మిస్టర్ మజ్ను’తో ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేని అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రంపై మరింత జాగ్రత్త తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే అఖిల్ తన తర్వాత సినిమాను బొమ్మరిల్లు భాస్కర్‌తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈనెల 26 నుంచి మొదలు కానుంది. దాదాపు సినిమాలో నటించే ప్రముఖ తారాగణం కూడా ఫిక్స్ అయ్యారు. కానీ ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇంకా సెట్ కాలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారని కొంతమంది.. లేదు ఓ కొత్త హీరోయిన్‌ను సెలెక్ట్ చేస్తారని మరికొందరు అంటున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.