Bheemla Nayak: బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోన్న భీమ్లానాయక్.. ఆరు రోజుల్లో ఎంత రాబట్టిందంటే..
Bheemla Nayak 6 days Collections: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం 'భీమ్లానాయక్'. నిత్యామేనన్, సంయుక్తామేనన్ హీరోయిన్లుగా నటించారు
Bheemla Nayak 6 days Collections: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం ‘భీమ్లానాయక్’. నిత్యామేనన్, సంయుక్తామేనన్ హీరోయిన్లుగా నటించారు. సాగర్ కే. చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్ర్కీన్‌ప్లే అందించారు. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. పవర్‌స్టార్ అభిమానులను విజువల్ ట్రీట్ ఇస్తూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈక్రమంలోనే పవర్‌స్టార్ గత చిత్రాల రికార్డులన్నింటినీ భీమ్లానాయక్ (Bheemla Nayak )కొల్లగొడుతున్నాడని, అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. మరి ఈ ఆరురోజుల్లో భీమ్లానాయక్ రాబట్టిన కలెక్షన్ల వివరాలపై ఓ లుక్కేద్దాం రండి.
బ్రేక్ ఈవెన్ కు దగ్గరలో…
కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు రోజులకు కలిపి భీమ్లానాయక్‌కు రూ. 68.820 కోట్ల షేర్ రాగా.. 104.80 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మరో 7.50 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. అదేవిధంగా ఓవర్‌సీస్ లో రూ. 11.45 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ. 87.79 కోట్ల షేర్, రూ.135 కోట్ల గ్రాస్ వసూలైంది. కాగా భారీ బడ్జెట్‌తో తెరెక్కిన భీమ్లా నాయక్ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అదే ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో సినిమాకు బ్రేక్ ఈవెన్ దక్కాలంటే రూ. 108 కోట్ల వసూళ్లు సాధించాలి. ప్రస్తుతం రూ.87.79 కోట్ల షేర్ వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 20.21 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. ఈ శుక్రవారం ఆడవాళ్లు మీకు జోహార్లు తదితర సినిమాలు రానున్న నేపథ్యంలో రానున్న మరో మూడు రోజులు ‘భీమ్లానాయక్’కు మరింత కీలకం కానున్నాయి.
Also Read:Pumpkin Seeds: గుమ్మడి గింజలను పడేస్తున్నారా.. గింజల పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..