AHA OTT: బాల్య వివాహాలపై ఆహా సరికొత్త వెబ్‌ సిరీస్‌ ‘ఖుబూల్‌ హై’.. ఎప్పటినుంచి స్ట్రీమింగ్‌ కానుందంటే..

Qubool Hai Web Series: డిజిటల్ మాధ్యమం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను అందిస్తూ మన్ననలు అందుకుంటోంది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ 'ఆహా'.

AHA OTT: బాల్య వివాహాలపై ఆహా సరికొత్త వెబ్‌ సిరీస్‌ 'ఖుబూల్‌ హై'.. ఎప్పటినుంచి స్ట్రీమింగ్‌ కానుందంటే..
Qubool Hai
Follow us
Basha Shek

|

Updated on: Mar 03, 2022 | 11:56 AM

Qubool Hai Web Series: డిజిటల్ మాధ్యమం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను అందిస్తూ మన్ననలు అందుకుంటోంది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘ఆహా’. ఇందులో భాగంగా అన్‌స్టాపబుల్‌ వంటి ఛాట్‌ షోలతో పాటు వివిధ భాషల్లో విజయవంతమైన చిత్రాలను తెలుగులోకి అనువదిస్తోంది. అదేవిధంగా ఆసక్తికరమైన కంటెంట్‌తో వెబ్‌సిరీస్‌లనూ రూపొందిస్తోంది. అలా తాజాగా తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ ‘ఖుబూల్‌ హై’. ఇటీవల విడుదలైన ఈ సిరీస్‌ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. టీజర్‌ను చూస్తుంటే.. హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలోని ఓ ప్రాంతంలో జరిగే బాల్య వివాహలకు కాస్త క్రైమ్ నేపథ్యాన్ని జోడించి ఆసక్తికరంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా అరబ్‌ షేక్‌ల చేతుల్లో పడి నలిగిపోతున్న అమ్మాయిల దీనగాథలు, మహిళల అక్రమ రవాణా తదితర అంశాలను ఇందులో చూపించారు. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

కాగా ఖుబూల్ హై వెబ్‌ సిరీస్‌కు పింగిల్‌ ప్రణవ్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో మహిళల అక్రమ రవాణా, శరణార్థుల సమస్యలపై ఎన్నో డాక్యుమెంటరీలు తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారాయన. అతను చివరిగా రూపొందించిన ‘ఆక్యుపైడ్’ ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ వీడియో ఫెస్టివల్‌కు ఎంపికైన ఏకైక వెబ్ సిరీస్‌ గా నిలిచింది. ఇక టీజర్ లో కనిపించిన వారిలో మనోజ్ ముత్యం, వినయ్ వర్మ తెలిసిన వారే కాగా మిగతా వాళ్లంతా కొత్త ముఖాలే. ఈ చిత్రానికి కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రఫీ అందించగా.. జెర్రీ సిల్వెస్టర్ విన్సెంట్ నేపథ్య సంగీతం అందించారు. హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో రూపొందించిన ఈ వెబ్‌ సిరీస్‌ మార్చి 11 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Also Read:AP High Court: ఏపీలో మూడు రాజధానులు, CRDA రద్దు పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు..

Viral Video: దృఢ సంకల్పం ఉండాలేగానీ.. బతకడానికి శతకోటి మార్గాలు.. స్ఫూర్తిదాయకమైన స్టోరీ

Isha Koppikar: ఆ హీరో నన్ను ఏకాంతంగా కలవమన్నాడు.. కెరీర్‌ ప్రారంభం నాటి చేదు అనుభవాలను గుర్తు చేసుకున్న చంద్రలేఖ హీరోయిన్‌..

ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
ఓరుగల్లు అబ్బాయి.. ఇటలీ అమ్మాయి స్టెప్స్ మీరు చూడాల్సిందే...
ఓరుగల్లు అబ్బాయి.. ఇటలీ అమ్మాయి స్టెప్స్ మీరు చూడాల్సిందే...