Isha Koppikar: ఆ హీరో నన్ను ఏకాంతంగా కలవమన్నాడు.. కెరీర్‌ ప్రారంభం నాటి చేదు అనుభవాలను గుర్తు చేసుకున్న చంద్రలేఖ హీరోయిన్‌..

'మీటూ' ఉద్యమం తర్వాత సినీ పరిశ్రమలో తమకు ఎదురైన లైంగిక వేధింపులపై చాలామంది నోరు విప్పారు. స్టార్‌ హీరోయిన్ల నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ ల వరకు ధైర్యంగా క్యాస్టింగ్‌ కౌచ్‌ (Casting couch) అనుభవాలను షేర్‌ చేసుకుంటున్నారు.

Isha Koppikar: ఆ హీరో నన్ను ఏకాంతంగా కలవమన్నాడు.. కెరీర్‌ ప్రారంభం నాటి చేదు అనుభవాలను గుర్తు చేసుకున్న చంద్రలేఖ హీరోయిన్‌..
Isha Koppikar
Follow us
Basha Shek

|

Updated on: Mar 03, 2022 | 10:25 AM

‘మీటూ’ ఉద్యమం తర్వాత సినీ పరిశ్రమలో తమకు ఎదురైన లైంగిక వేధింపులపై చాలామంది నోరు విప్పారు. స్టార్‌ హీరోయిన్ల నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ ల వరకు ధైర్యంగా క్యాస్టింగ్‌ కౌచ్‌ (Casting couch) అనుభవాలను షేర్‌ చేసుకుంటున్నారు. తాజాగా అక్కినేని నాగార్జునతో కలిసి చంద్రలేఖలో నటించిన ఇషా కొప్పికర్‌ (Isha Koppikar) కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ బారిన పడిందట. 90వ దశకంలో బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన ఈ అందాలతార ప్రస్తుతం వెబ్‌సిరీస్‌లు చేస్తోంది. ఈ సందర్భంగా సినిమా కెరీర్‌ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ఇషా గుర్తు చేసుకుంది. ‘మా కుటుంబంలో ఎక్కువమంది డాక్టర్లే. అయితే కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో పాకెట్‌ మనీ కోసం నేను మోడలింగ్‌లోకి అడుగుపెట్టా. అదే సమయంలో సినిమా అవకాశాలు కూడా తలుపుతట్టాయి. కెరీర్‌ ఆరంభించిన కొత్తలో ఓ నిర్మాత నుంచి నాకు కాల్‌ వచ్చింది. ‘మేము చేస్తున్న సినిమాలో మిమ్మల్ని హీరోయిన్‌గా అనుకుంటున్నాం. మా హీరోకీ మీరు బాగా నచ్చేశారు. వీలుంటే ఒక్కసారి ఆయన్ని ఒంటరిగా కలవండి’ అని ఆయన చెప్పాడు. ఆ సమయంలో నిర్మాత మాటలు నాకు అర్థం తెలియలేదు. దీంతో ఆ హీరోకి కాల్‌ చేస్తే ‘ఒంటరిగా మీరు ఒక్కరే నా వద్దకు రండి. మీ స్టాఫ్‌ని కూడా వెంటతీసుకుని రావొద్దు’ అని చెప్పడంతో వాళ్ల ఉద్దేశం నాకు అర్థమైంది. ఆ మాటలకు బాధగా అనిపించింది. వెంటనే నిర్మాతకు ఫోన్‌ చేశాను. ‘నా ట్యాలెంట్‌ ఆధారంగా చేసుకుని ఆఫర్స్‌ వస్తే చేస్తాను’ అని గట్టిగా చెప్పేశాను. దీంతో ఆహీరోని కలవలేదనే కారణంతోనన్ను ఆ ప్రాజెక్ట్‌ నుంచి తీసేశారు’ అని అప్పటి చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది ఇషా. అయితే ఆ హారో ఎవరనేది మాత్రం బయటకు వెల్లడించలేదామె.

కాగా ‘ఏక్‌ థా దిల్‌ ఏక్‌ థా ధడ్కన్‌’తో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఇషా కొప్పికర్‌. ఆ తర్వాత వరస అవకాశాలు అందుకుంది. హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే తెలుగులో నాగార్జున చంద్ర లేఖ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో రమ్యకృష్ణ కూడా నటించింది. ఆ తర్వాత వెంకటేశ్‌తో కలిసి ప్రేమతో రా సినిమాలో సందడి చేసింది. 2009లో టిమ్మీనారంగ్‌ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న ఆమె 2014లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత చాలా ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈషా కొప్పికర్‌ 2017లో మళ్లీ సెకండ్‌ ఇన్నింగ్స్ ప్రారంభించింది. నిఖిల్‌ హీరోగా వచ్చిన ‘కేశవ’ సినిమాలో పోలీసాఫీసర్‌గా నటించి ప్రశంసలు అందుకుంది.

Also Read:Iron: మీకు ఐరన్ లోపం ఉందా.. అయితే ఈ ఆహారాలు తీసుకోండి చాలు..

Priyanka jawalkar : ట్రెండీ లుక్స్ తో ఫిదా చేస్తున్న ప్రియాంక జవాల్కర్ లేటెస్ట్ ఫొటోస్

Viral Video: చిల్లర నాణేలతో స్కూటర్‌ కొన్న వ్యక్తి !! వీడియో వైరల్

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్