AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iron: మీకు ఐరన్ లోపం ఉందా.. అయితే ఈ ఆహారాలు తీసుకోండి చాలు..

విటమిన్లు(Vitamins), ఖనిజాలు, పోషకాలు మన శరీరానికి చాలా అవసరం. ఈ పోషకాలలో ముఖ్యంగా ఐరన్(Iron) ఉండాలి...

Iron: మీకు ఐరన్ లోపం ఉందా.. అయితే ఈ ఆహారాలు తీసుకోండి చాలు..
Iron
Srinivas Chekkilla
|

Updated on: Mar 03, 2022 | 10:15 AM

Share

విటమిన్లు(Vitamins), ఖనిజాలు, పోషకాలు మన శరీరానికి చాలా అవసరం. ఈ పోషకాలలో ముఖ్యంగా ఐరన్(Iron) ఉండాలి. వివిధ వ్యాధులతో పోరాడటానికి మన శరీరంలో ఐరన్ చాలా ముఖ్యం. ఐరన్ లోపం వల్ల హిమోగ్లోబిన్(Hemoglobin) రక్తహీనత వంటి వ్యాధికి దారితీస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా ప్రభావితం చేస్తుంది. వాస్తవానికి, శరీరంలో ఇనుము లోపం ఉన్నప్పుడు, శరీరంలో ఎర్రరక్తకణాలు తగ్గి అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అటువంటి పరిస్థితిని నివారించడానికి మీరు మీ ఆహారంలో ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలను చేర్చాలి.

పాలకూర

పాలకూర వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనాలు లభిస్తాయి. పాలకూరలో ఇనుముతో పాటు అనేక విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ వ్యతిరేక, యాంటీ ఓవర్సిటీ లక్షణాలతో రక్తంలో చక్కెర తగ్గించే లక్షణాలను కలిగి ఉంది. పాలకూరలో కనిపించే లక్షణాల కారణంగానే చాలా మంది వైద్యులు ఆహారంలో పాలకూరలో చేర్చాలని సిఫారసు చేస్తారు.

చిక్కుళ్లు

చిక్కుళ్లు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటి వల్ల గుండె జబ్బులు, హైపర్ టెన్షన్, టైప్ 2 మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కొంతవరకు తగ్గుతాయి. చిక్కుల్లో ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్ బి, ఐరన్, కాపర్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉంటాయి.

ఎండు ద్రాక్ష

మీ శరీరంలో ఐరన్ లోపం ఉంటే మీరు ఎండు ద్రాక్ష ఆహారంలో చేర్చుకోవాలి. ఎండుద్రాక్షలో తగినంత మొత్తంలో ఇనుము లభిస్తుంది. రక్తం ఏర్పడటానికి విటమిన్ బి కాంప్లెక్స్ అవసరం. ఎండుద్రాక్షలో విటమిన్ బి కాంప్లెక్స్ తగినంత పరిమాణంలో కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో రక్తహీనత మరియు ఐరన్ లోపం ఉన్నవారు ఎండుద్రాక్ష తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

గుడ్లు

గుడ్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి మరియు దాదాపు అన్ని విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. గుడ్లలో విటమిన్ డి మరియు ఐరన్ కూడా చాలా ఉంటుంది. గుడ్లలో ప్రోటీన్ మరియు కాల్షియం కూడా సమృద్ధిగా ఉంటాయి.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించండి.

Read Also.. Constipation: మలబద్ధకం సమస్య బాధిస్తుందా.. అయితే ఈ పని చేయండి..