Pumpkin Seeds: గుమ్మడి గింజలను పడేస్తున్నారా.. గింజల పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

Pumpkin Seeds Powder: మొక్కలు, అవి ఇచ్చే ఉత్పత్తులు శరీరానికి మంచి పోషకాలు ఇస్తాయి. గుమ్మడికాయలు (Pumpkin )కూడా మంచి పోషకాహారం. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు,..

Pumpkin Seeds: గుమ్మడి గింజలను పడేస్తున్నారా.. గింజల పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
Pumpkin Seeds Powder
Follow us

|

Updated on: Mar 03, 2022 | 11:01 AM

Pumpkin Seeds Powder: మొక్కలు, అవి ఇచ్చే ఉత్పత్తులు శరీరానికి మంచి పోషకాలు ఇస్తాయి. గుమ్మడికాయలు (Pumpkin )కూడా మంచి పోషకాహారం. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ప్రొటీన్లు ,ఫైబర్‌లు ఉన్నాయి. గుమ్మడికాయలు దక్షిణ అమెరికా(South Africa)కు చెందినవి. అయితే ఇవి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆకలిని పెంచే ప్రధాన వంటకంగా పేరుగాంచింది గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయను ప్రధాన వంటకాలు, సైడ్ డిష్‌లు, సూప్‌లు, సలాడ్‌లతో పాటు  డెజర్ట్‌లల్లోనూ ఉపయోగిస్తారు. అయితే ఈ గుమ్మడి కాయను ఉపయోగించిన తర్వాత చాలామంది… వీటి గింజలను బయటకు విసిరివేస్తారు. అయితే ఈ గుమ్మడికాయ గింజలను నిర్లక్ష్యంగా అలా విసిరివేయద్దని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ప్రోటీన్, టోకోఫెరోల్స్, ఫైటోఈస్ట్రోజెన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ , మినరల్స్ వంటి మంచి పోషకాలు నిండి ఉన్నాయి. వాస్తవానికి, గుమ్మడికాయ గింజల నుంచి తయారు చేసే నూనె అలోపేసియా, క్యాన్సర్ , వంధ్యత్వం వంటి వ్యాధుల నివారణకు చికిత్సగా ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు పలు అధ్యయనాలు చేస్తున్నారు. ఈరోజు గుమ్మడికాయ గింజల పొడి,  పోషకాహారం, అవి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం..

  1. గుమ్మడి గింజల పొడి: గుమ్మడికాయ గింజలు గుమ్మడికాయల నుండి వస్తాయి. ఇవి భారీ పొట్లకాయలు కుకుర్బిటేసి కుటుంబానికి చెందినవి. గుమ్మడికాయ, పుచ్చకాయ, స్క్వాష్ , దోసకాయలకు తోబుట్టువు అని అంటారు. పచ్చి లేదా కాల్చిన గుమ్మడికాయ గింజలను గ్రైండ్ చేయడం వల్ల గుమ్మడికాయ గింజల పొడి తయారవుతుంది. ఈ గుమ్మడికాయ గింజల పొడిలో ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలను కలిగి ఉంది. అంతేకాదు కొవ్వు , కొలెస్ట్రాల్ లేకుండా కూడా ఉంటుంది.
  2. గుమ్మడి గింజల పొడి ఆరోగ్య ప్రయోజనాలు: దీనిలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు లభిస్తాయి. 1 ఔన్స్ (28 గ్రాములు) గుమ్మడికాయ గింజల పొడిలో 18 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. అంతేకాదు ప్రోటీన్ అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి.  ముఖ్యంగా మానవ శరీరం స్వయంగా తయారు చేసుకోలేని తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఈ గుమ్మడి గింజల పొడిలో ఉన్నాయి. కనుక అమైనో ఆమ్లాలు శరీరానికి అవసరమైనవారు అధిక నాణ్యత గల ప్రోటీన్ ఆహారాలను తినడం చాలా ముఖ్యం. కండరాల నిర్మాణానికి ప్రభావవంతమైన ముఖ్యమైన అమైనో ఆమ్లాలు, రోగనిరోధక శక్తి ఉన్న ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఇందులో ఉన్నాయి.
  3. గుమ్మడికాయ గింజల పొడి మీ ఆరోగ్యానికి తోడ్పడడంతో పాటు.. మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది. సాధారణంగా నిద్రలేమి ఉన్నవారికి ఈ గుమ్మడి గింజల పొడి మంచి సహాయకారి. ఇందులో నిద్ర పట్టడానికి సహాయకారి అయిన ఐరన్ సప్లిమెంటేషన్ ఉందని 2018 సమీక్ష 93 కథనాలను విశ్లేషించింది.
  4. వ్యాధిని నిరోధించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లతో ఈ గుమ్మడి గింజల పొడి నిండి ఉంటుంది. ఈ పొడి వ్యాధిపై పోరాటంతో పాటు.. రోగనిరోధక శక్తిని పెంపొందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.  బయోయాక్టివ్ సమ్మేళనాలు,  యాంటీఆక్సిడెంట్లను అత్యధికంగా కలిగి ఉంటుంది.
  5. గుమ్మడికాయ గింజల పొడి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ గుమ్మడి గింజల ఒక ఔన్స్ (28 గ్రాములు) పొడిలో 4 గ్రాముల డైటరీ ఫైబర్‌ కలిగి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి ముఖ్యమైన పోషకం.
  6. గుమ్మడి గింజల పొడి జుట్టు పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా జుట్టురాలడాన్ని తగ్గిస్తుంది. ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. అంతేకాదు గుమ్మడికాయ గింజల నూనె జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపిస్తుందని.. ఓ అధ్యయనంలో తెలిసింది. రోజూ ఈ నూనెను 24 వారాల పాటు ఉపయోగిస్తే.. పురుషుల్లో తిరిగి 40% జుట్టు తిరిగి పెరిగింది. అయితే కొన్ని అధ్యయనాలు గుమ్మడికాయ గింజల నూనెను పరీక్షించాయి, పొడి కాదు, కాబట్టి మరింత పరిశోధన అవసరమని అంటున్నారు.
  7. గుమ్మడికాయ గింజల నూనె పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యానికి  మేలు చేస్తుంది. ఇటీవలి జంతు అధ్యయనం మగ రూస్టర్ల పునరుత్పత్తి ఆరోగ్యంపై గుమ్మడికాయ గింజల నూనె, విటమిన్ E నూనె , పొద్దుతిరుగుడు నూనె ప్రభావాలను పరీక్షించింది. వీటిల్లో గుమ్మడి గింజల నూనె అత్యంత ప్రభావంతంగా పనిచేస్తుందని ఫలితాల ద్వారా వెల్లడైంది.
  8. అయితే గుమ్మడికాయ గింజల పొడి చాలా మందికి బాగా పని చేస్తుంది.అయినప్పటికీ ఎవరికైనా గుమ్మడికాయ అంటే  ఉంటే దూరంగా ఉండడం మంచిది.
  9. అయితే కాల్చిన గుమ్మడికాయ గింజల నుండి తయారైన గుమ్మడికాయ గింజల పొడి ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండవచ్చు. ఎందుకంటే దీనిలో అధికంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. పచ్చి గుమ్మడికాయ గింజలు కాల్చిన గుమ్మడి గింజల మాదిరిగానే రుచి, వాసన లేదా ఈజీగా జీర్ణమయ్యే అవకాశం తక్కువ.

(Note:ఈ సమాచారం పాఠకుల ఆసక్తిని అనుసరించి ఇచ్చింది. ఎవరైనా ఆరోగ్య నిపుణులు, లేదా వైద్యుల సలహాలను అనుసరించి ఉపయోగించాల్సి ఉంటుంది.)

Also Read:

 మీకు ఐరన్ లోపం ఉందా.. అయితే ఈ ఆహారాలు తీసుకోండి చాలు..

Latest Articles