AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea: మీరు రోజుకు ఎన్ని సార్లు చాయ్ తాగుతారు.. టీ తాగడంతో బరువు పెరుగుతారా.. తగ్గుతారా..?

చాయ్(Tea) ఉదయం లేవగానే తాగాల్సిందే.. టీ తాగకుంటే వారికి ఏ పని తోచదు. అయితే చాయ్ రోజుకు ఒక్కసారి కాదు..

Tea: మీరు రోజుకు ఎన్ని సార్లు చాయ్ తాగుతారు.. టీ తాగడంతో బరువు పెరుగుతారా.. తగ్గుతారా..?
Tea
Srinivas Chekkilla
|

Updated on: Mar 03, 2022 | 12:46 PM

Share

చాయ్(Tea) ఉదయం లేవగానే తాగాల్సిందే.. టీ తాగకుంటే వారికి ఏ పని తోచదు. అయితే చాయ్ రోజుకు ఒక్కసారి కాదు మూడు నుంచి నాలుగు సార్లు తాగుతుంటారు. అయితే టీలో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల లావైపోతారు(Weight) కూడా. అయితే టీ తాగడం మానేయాలా..? దీని వల్ల సమస్యలు వస్తాయా..? అలాంటప్పుడు ఏం చేయాలి అనే ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి. అయితే కొన్ని ముఖ్యమైన టిప్స్(Tips) పాటించడంతో మీరు బరువు పెరగకుండా ఉండొచ్చు

చాలా మంది టీని పెట్టుకునేటప్పుడు కొద్దిగా అల్లం లేదా ఇలాచి వాడుతూ ఉంటారు. నిజానికి ఇలా చేయడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. అలానే ఆరోగ్యానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. కనుక టీని పెట్టుకునేటప్పుడు కొంచెం తులసి కానీ కానీ యాలుకలు కానీ లవంగాలను కానీ వేసుకోండి. ఇలా చేయడం వల్ల దానిలో పోషక పదార్థాలు పెరుగుతాయి. అదే విధంగా మెటబాలిజంకి ఉపయోగ పడుతుంది. బరువుని అదుపులో ఉంచడానికి కూడా ఇది సహాయ పడుతుంది. ముఖ్యంగా లవంగాలు కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి.

బాగా లావై పోతున్నాము అని అనుకునే వాళ్లు క్యాలరీలను తగ్గించుకోవడానికి ఫ్యాట్ మిల్క్ కాకుండా చూసుకోండి. ఎక్కువ కొవ్వు ఉండే పాలని ఉపయోగించడం వల్ల లావైపోతారు. మీరు కావాలంటే ఓట్స్ మిల్క్, ఆల్మండ్ మిల్క్ లేదా సోయా మిల్క్ వాడొచ్చు. అదే విధంగా క్రీమ్ ఉండే పాలకు దూరంగా ఉండటం మంచిది. ఇలా చేయడం వల్ల కూడా క్యాలరీలు తగ్గుతాయి. పైగా బరువు పెరిగి పోకుండా ఉండడానికి కూడా అవుతుంది.

చాయ్ మానలేక పోతున్నారా.. అయితే దానిలో ఉండే చక్కెర శాతాన్ని తగ్గించండి. వీలైతే పూర్తిగా చక్కెరను తగ్గించడం కూడా మంచిదే. కొద్దిగా చక్కెరను తగ్గిస్తే కేలరీలు కూడా తగ్గుతాయి. కావాలి అనుకుంటే మీరు చక్కెరని తగ్గించి అందులో బెల్లం కానీ తేనె కానీ వేసుకోండి. ఇలా చేయడం వల్ల తియ్యదనం వస్తుంది. అలాగే చక్కెర వల్ల కలిగే నష్టాల నుండి కూడా మీరు దూరంగా ఉండొచ్చు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించండి.

Read Also.. Dates: శరీరానికి ఖర్జూర చేసే మేలు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.. కానీ వేసవిలో దీన్ని తింటున్నారా..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!