Dates: శరీరానికి ఖర్జూర చేసే మేలు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.. కానీ వేసవిలో దీన్ని తింటున్నారా..

ఖర్జూర మన శరీరానికి ఎంతో మంచిది. శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఆహారంలో ఖర్జూరాన్ని తినమని వైద్యులు సూచిస్తారు...

Dates: శరీరానికి ఖర్జూర చేసే మేలు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.. కానీ వేసవిలో దీన్ని తింటున్నారా..
Benefits Of Dates
Follow us

|

Updated on: Mar 02, 2022 | 4:33 PM

ఖర్జూర మన శరీరానికి ఎంతో మంచిది. శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఆహారంలో ఖర్జూరాన్ని తినమని వైద్యులు సూచిస్తారు. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరచడంతో పాటు, ఎనర్జీ లెవెల్‌ను పెంచేందుకు కూడా ఇది పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి శరీరంలో రక్త కొరతను తొలగించడం వరకు, ఖర్జూరాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఖర్జూరం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చలికాలంలో ఖర్జూరం తినడం ఆరోగ్యానికి చాలా అవసరం. కావీ వేసవి కాలంలో ఖర్జూరను తక్కువగా తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఖర్జూర శరీరానికి కాస్త వేడి చేస్తుంది.

100 గ్రాముల కర్జూరంలో 280క్యాలరీలు అందుతాయి. అతి తేలికగా జీర్ణం అయిపోతుంది. శరీరానికి అవసరమైన శక్తినివ్వటానికి శరీరంలోని వ్యర్ధాలను తొలగించటానికి బాగా ఉపయోగపడుతుంది. ఖర్జూరంలో మెడిసినల్ విలువలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఫ్రక్టోజ్‌, డెక్స్‌ట్రోజ్‌ అనే చక్కెర పదార్థాలు ఎక్కువుగా ఉండటం వల్ల ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు చెబుతున్నారు. ఖర్జూర పండ్లు విటమిన్ ఎ, బి లను కలిగి ఉంటాయి. ఈ రెండూ ఇందులో ఉండటం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచుటలో ఎంతగానో ఉపయోగపడతాయి. పొటాషియం ఎక్కువగా లభించే ఖర్జూరాలు తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు అదుపులో వుంటాయి. అలాగే ఇవి గుండెకు సంబంధించిన అనేక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి.

ఇవి శరీరంలోని కణాల ఎదుగుదలకు చాలా అవసరం. ఖర్జూరాలలో కొలెస్ట్రాల్, క్యాలరీలు తక్కువగా, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ ఖర్జూరలో యాంటీ ఆక్సిడెంట్ల రూపంలో ఉండే విటమిన్ ఎ కంటికి చాలా మంచింది. క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్ వంటి మినరల్స్ అధికంగా లభిస్తాయి. క్యాల్షియం ఎముకలను, దంతాలను ధృఢంగా ఉంచడానికి కాపర్ ఎర్రరక్త కణాల ఉత్పత్తికి, మాంగనీస్ ఎముకల పెరుగుదలకు ఉపయోగపడతాయి. మలబ్ధకంతో బాధపడే వారు కొన్ని ఖర్జూరాల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున వాటిని తిని, ఆ నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

డేట్స్ లో ఉండే విటమిన్ సి, డిలు స్కిన్ ఎలాసిటిని పెంచుతాయి. దాంతో చర్మం స్మూత్ గా మారుతుంది. చర్మ సమస్యలను నివారిస్తుంది. అసలే కరోనా ముప్పతిప్పలు పెడుతోంది. ఖర్జూరాలను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకుని రోగ నిరోధక శక్తి పెంచుకుంటూ కరోనాకు చెక్ పెట్టేద్దాం.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించండి.

Read Also.. Obesity: ఊబకాయం మూత్రపిండాలపై ప్రభావం చూపుతుందా?