AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleep: మీకు బోర్లాపడుకునే అలవాటు ఉందా.. అయితే చాలా సమస్యలు వస్తాయి.. ముఖ్యంగా స్త్రీల్లో..

మనం ఆరోగ్యంగా ఉండలంటే నిద్ర చాలా ముఖ్యం. ఒక వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోతే అతనిపై ఎలాంటి ఒత్తిడి ఉండదు.

Sleep: మీకు బోర్లాపడుకునే అలవాటు ఉందా.. అయితే చాలా సమస్యలు వస్తాయి.. ముఖ్యంగా స్త్రీల్లో..
Sleep
Srinivas Chekkilla
|

Updated on: Mar 02, 2022 | 6:18 PM

Share

మనం ఆరోగ్యంగా ఉండలంటే నిద్ర చాలా ముఖ్యం. ఒక వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోతే అతనిపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. మంచి నిద్ర రోజంతా మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. అయితే చాలా మంది సరిగా నిద్రపోరు. నిద్రపోవడానికి ప్రయత్నించినా నిద్ర రాదు. అంతే కాకుండా పడుకునే విధానం ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. ఇలా చాలా మందికి బోర్లాపడుకునే అలవాటు ఉంటుంది. ఇలా బోర్లాపడుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని మీకు తెలుసా? ముఖ్యంగా మహిళలు బోర్లా పడుకుని నిద్రపోతే అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురవుతారు. ఎవరైనా ఇలా బోర్లా పడుకుని నిద్రిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం.

ఛాతి నొప్పి

ఇలా బోర్లా పడుకునే వారికి ఛాతీ నొప్పి వస్తుంది. సోఫాపై పడుకున్నప్పుడు, ఛాతీపై ఒత్తిడి ఉంటుంది. ఇలా నిరంతరం ఒత్తిడి కారణంగా నొప్పి వస్తుంది. కాబట్టి మీకు ఛాతీ నొప్పి ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇకపై అలా బోర్లా పడుకునే అలవాటు మానేయండి.

చర్మ సమస్యలు

బోర్లా పడుకోవడం వల్ల ముఖ సౌందర్యం దెబ్బతింటుంది. ఇలా నిద్రపోవడం వల్ల చర్మానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీంతో చర్మం ముడుచుకోవడం ప్రారంభమవుతుంది. అదే సమయంలో మంచం మీద మురికి ముఖం మీదికి వస్తుంది, ఇది మొటిమలు లేదా ముడతలకు దారితీస్తుంది.

గర్భధారణ సమస్య

గర్భధారణ సమయంలో స్త్రీలు ఇలా పడుకుని నిద్రపోకూడదు. అలా పడుకుంటే తల్లికే కాదు బిడ్డకు కూడా హాని కలుగుతుంది.

కడుపు సమస్యలు

స్త్రీలే కాదు పురుషులు కూడా బోర్లా పడుకోకూడదు. లేదంటే మీరు కొన్ని పొట్ట సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. అది కూడా జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ముఖ్యంగా అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలను వస్తాయి.

వెన్నెముకకు మంచిది కాదు

నిద్ర లేమి దీర్ఘకాలిక వెన్నునొప్పికి దారితీస్తుంది. ఈ స్థితిలో పడుకున్నప్పుడు రాత్రి సమయంలో వెన్నెముకపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందువలన వెన్నునొప్పి రావొచ్చు

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించండి.

Read Also.. Dates: శరీరానికి ఖర్జూర చేసే మేలు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.. కానీ వేసవిలో దీన్ని తింటున్నారా..