Bigg Boss OTT: ప్రేక్షకులకు షాక్.. ఆగిపోయిన బిగ్‏బాస్ నాన్‏స్టాప్.. కారణం చెప్పిన నిర్వాహకులు..

బిగ్‏బాస్ (Bigg Boss) రియాల్టీ షోకు ఉన్న ప్రేక్షకాధరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై ప్రసారమవుతున్న అన్ని షోల కంటే బిగ్‏బాస్ షో ప్రత్యేకం..

Bigg Boss OTT: ప్రేక్షకులకు షాక్.. ఆగిపోయిన బిగ్‏బాస్ నాన్‏స్టాప్.. కారణం చెప్పిన నిర్వాహకులు..
Bigg Boss Non-Stop
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 03, 2022 | 3:49 PM

బిగ్‏బాస్ (Bigg Boss) రియాల్టీ షోకు ఉన్న ప్రేక్షకాధరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై ప్రసారమవుతున్న అన్ని షోల కంటే బిగ్‏బాస్ షో ప్రత్యేకం.. ఇప్పటివరకు తెలుగులో ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ షో.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాంపై సందడి చేస్తోంది. గత నెల 26న ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏లో నో కామా.. నో ఫుల్ స్టాప్ 24 గంటలు బిగ్‏బాస్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈషోకు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ బిగ్‏బాస్ నాన్ స్టాప్ షోలో కంటెస్టెంట్స్ మాత్రమే కాకుండా.. కొత్తవారు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఓటీటీలోనూ ఈషోను వీక్షించేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అది కూడా గంట మాత్రమే కాకుండా.. 24 గంటలు లైవ్ అనేసరికి… డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్‏స్క్రైబ్ చేసుకున్న వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇప్పటివరకు ఈ షో స్ట్రీమింగ్ విషయానికి వస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో ప్రేక్షకులకు నిన్న రాత్రి ఊహించని షాకిచ్చింది సదురు ఓటీటీ.

రోజూ లైవ్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో.. బుధవారం అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఈ షో లైవ్ ఆగిపోయింది. తొలిరోజు నాగార్జున వచ్చిన లాంఛింగ్ ఎపిసోడ్ మళ్లీ రిపీట్ చేశారు. ఈ క్రమంలోనే.. మరింతగా నాన్ స్టాప్ వినోదాన్ని అందించేందుకు ఇంటిని సిద్ధం చేస్తున్నాం.. గురువారం అర్దరాత్రి 12 గంటల నుంచి లైవ్ తిరిగి ప్రారంభమవుతుంది. ఏరోజుకు ఆరోజు పూర్తి ఎపిసోడ్‏ను రాత్రి 9 గంటలకు విడుదల అవుతుంది. తప్పక చూడండి అంటూ స్క్రోలింగ్ వేసారు. ఇక గురువారం నుంచి లైవ్ విషయంలో మార్పులు జరగనున్నాయి. ఈరోజు జరిగిన ఎపిసోడ్ ను రేపటి రోజున ప్రసారం చేయనున్నారు. అంటే ప్రసారం జరిగిన రోజుకీ.. ఇంట్లో జరిగిన రోజుకు ఒక్కరోజు గ్యాప్ ఉండనుంది. అంతేకాకుండా.. గురువారం రాత్రి నుంచి లైవ్ స్ట్రీమింగ్ ఎపిసోడ్ తోపాటు.. ఓ గంట నిడివితో ఆ రోజు మొత్తంలో జరిగిన హైలైట్స్ ఎపిసోడ్ వారిగా అప్ లోడ్ చేయబోతున్నారు.

Also Read: Rana Daggubati: అసలు హీరో అంటే ఏంటో తెలిసింది.. ఈ సినిమాకు ఆయనే వెన్నెముక.. రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్..

Siddhu Jonnalagadda: కుర్ర హీరోకు క్యూ కడుతున్న ఆఫర్లు.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌తో డీజే టిల్లు..?

Diet For Jaundice: పచ్చ కామెర్లు ఉన్నవారు తినాల్సిన ఆహారపు పదార్థాలు.. ఈ అలవాట్లను ఫాలో అయితే సమస్య చెక్..

Deepika Pilli: క్యూట్ లుక్స్ తో దీపికా పిల్లి సరికొత్త అందాల ప్రదర్శన.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్