AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddhu Jonnalagadda: కుర్ర హీరోకు క్యూ కడుతున్న ఆఫర్లు.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌తో డీజే టిల్లు..?

గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ టాలెంట్ సిద్దు జొన్నలగడ్డ.. మొదటి సినిమాతో నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కుర్ర హీరో రీసెంట్ గా డీజే టిల్లు సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు.

Siddhu Jonnalagadda: కుర్ర హీరోకు క్యూ కడుతున్న ఆఫర్లు.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌తో డీజే టిల్లు..?
Siddu Jonnalagadda
Rajeev Rayala
|

Updated on: Mar 03, 2022 | 3:05 PM

Share

Siddhu Jonnalagadda: గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ టాలెంట్ సిద్దు జొన్నలగడ్డ.. మొదటి సినిమాతో నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కుర్ర హీరో.. రీసెంట్ గా డీజే టిల్లు సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ యంగ్ హీరో నటనతో పాటు ఆటిట్యూడ్ కు యూత్ ఫిదా అయ్యారు. డీజే టిల్లు సినిమా మంచి అంచనాలు మధ్య విడులై సూపర్ హిట్ గా నిలిచింది. డీజే టిల్లు సినిమాతో సిద్దు ఒక్కసారిగా భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమా సక్సస్ తో ప్రేక్షకులకు దగ్గరయిన సిద్దు.. ఇప్పుడు అదే జోరు మీద సినిమాలను ఓకే చేస్తున్నాడని తెలుస్తుంది. సిద్దుతో సినిమాలు చేయడానికి కుర్ర దర్శకులు క్యూ కడుతున్నారని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది. కెరీర్ మొదటి నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న యంగ్ హీరో ఇప్పుడు కూడా అదే తరహా కథలను ఎంచుకుంటున్నాడట.

ప్రస్తుతం డీజే టిల్లు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సిద్దు.. ఇప్పుడు ఈ మూవీ సీక్వేల్ ను పట్టాలెక్కించాలని చూస్తున్నారట. డీజే టిల్లు కథతో పాటు ఈ మూవీలోని సాంగ్స్ కూడా మంచి హిట్ అవ్వడంతో ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సిద్దు ఓ ఓ కొత్త సినిమా చేస్తున్నాడు.డీజే నిర్మించిన నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ లోనే తన తదుపరి చిత్రం షూటింగ్ చేస్తున్నాడు సిద్దు. ఈ సినిమా పూర్తయిన తర్వాత డీజే టిల్లు సీక్వెల్ పట్టాలెక్కనుందట. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడట ఈ కుర్ర హీరో. ఇదిలా ఉంటే ఈ కుర్ర హీరోకు ఇప్పుడు క్రేజీ ఆఫర్ వచ్చిందని ఫిలింనగర్ కోడై కూస్తుంది. ఓ బడా దర్శకుడు సిద్దుతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడని టాక్. టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కన్ను ఇప్పుడు సిద్దు పై పడిందట. మనోడి యాటిట్యూడ్.. టైమింగ్ కు ఫిదా అయినా పూరి.. సిద్ధుతో ఓ సినిమా చేయాలని ఫిక్స్  అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో లైగర్ , జనగణమన సినిమాలు చేస్తున్న పూరి. సిద్దు కోసం ఓ కథను రెడీ చేస్తున్నాడట. ఈ రెండు సినిమాలు అయిపోయిన వెంటనే సిద్దు సినిమాను స్టార్ చేయనుకున్నాడట పూరి. మరి ఈవార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. వీటితోపాటు మలయాళ సూపర్ హిట్ చిత్రం కప్పెల రీమేక్ లోనూ సిద్ధు నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో మొదలు పెట్టనున్నాడు. ఈ మూవీని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో సిద్దు ఫుల్ జోష్ మీద ఉన్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ram Pothineni: నయా లుక్ లో రామ్.. న్యూ స్టైల్ కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Pushpa: జనాల్లో ఇంకా తగ్గని పుష్ప మేనియా.. నాటకం మధ్యలో శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన ఆర్టిస్ట్‌.. నవ్వులు పూయిస్తోన్న వైరల్‌ వీడియో..

Kamal Haasan: విక్రమ్‌ షూటింగ్‌కు కొబ్బరికాయ కొట్టేసిన కమల్‌.. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే..