AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: జనాల్లో ఇంకా తగ్గని పుష్ప మేనియా.. నాటకం మధ్యలో శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన ఆర్టిస్ట్‌.. నవ్వులు పూయిస్తోన్న వైరల్‌ వీడియో..

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) నటించిన 'పుష్ప' చిత్రం విడుదలై రెండు నెలలు గడిచిపోయాయి. అయినా పుష్పరాజ్‌ మేనియా ఇంకా జనాలను వీడడం లేదు. ఫంక్షన్లు, శుభకార్యాలు, పండగలు.. ఎక్కడ చూసిన పుష్ప పాటలే వినిపిస్తున్నాయి.

Pushpa: జనాల్లో ఇంకా తగ్గని పుష్ప మేనియా.. నాటకం మధ్యలో శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన ఆర్టిస్ట్‌.. నవ్వులు పూయిస్తోన్న వైరల్‌ వీడియో..
Pushpa
Basha Shek
|

Updated on: Mar 03, 2022 | 1:40 PM

Share

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) నటించిన ‘పుష్ప’ చిత్రం విడుదలై రెండు నెలలు గడిచిపోయాయి. అయినా పుష్పరాజ్‌ మేనియా ఇంకా జనాలను వీడడం లేదు. ఫంక్షన్లు, శుభకార్యాలు, పండగలు.. ఎక్కడ చూసిన పుష్ప పాటలే వినిపిస్తున్నాయి. ఇక నెట్టింట్లోనూ పుష్ప డైలాగులు, స్టెప్పులు, మేనరిజమ్స్‌కు రీక్రియేషన్లు, స్ఫూప్‌లే దర్శనమిస్తున్నాయి. ఇక క్రికెటర్లైతే మైదానంలోనే పుష్పరాజ్‌ స్టెప్పులు వేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఓ కళాకారుడు పుష్ప సినిమాలోని ‘శ్రీవల్లి’ (Srivalli Song) పాట హుక్ స్టెప్ వేసిన తీరు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు అందరిచేతా నవ్వులు పూయిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకకు చెందిన ఓ యక్షగాన కళాకారుల బృందం ఇటీవల మంగళూరులో ఓ నాటకం ప్రదర్శించింది. అయితే స్టేజీపై నాటకం ప్రదర్శిస్తున్న సమయంలోనే శ్రీవల్లి పాట వినిపించింది. అంతే.. స్టేజీపై ఉన్న కళాకారుల్లో ఒకరు.. బన్నీ హుక్ స్టెప్పును దింపేశాడు. దీంతో స్టేజీపై ఉన్న తోటి కళాకారులతో, ప్రేక్షకులు ఒక్కసారిగా నవ్వేశారు. అంతేకాదు ఇతర కళాకారులు కూడా అతనిని అనుకరించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అల్లు అర్జున్-రష్మిక మందన్నా కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ సినిమా గతేడాది డిసెంబర్ 21న విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్‌ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. బాలీవుడ్ లోనూ వంద కోట్లు కలెక్షన్లను రాబట్టింది. ఇక సినిమాలోని పాటలు, మాటలు, డైలాగులు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాయి. సెలబ్రిటీలు సైతం వీటిని అనుకరిస్తూ వీడియోలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. కాగా త్వరలోనే పుష్ప 2 షూటింగ్ కూడా పట్టాలెక్కనుంది. ఇప్పటికే షూటింగ్‌ లోకేషన్ల కోసం చిత్రబృందం గాలిస్తోంది.

View this post on Instagram

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

Also Read:Virat Kohli: మొదటిసారిగా కోహ్లీ పేరు అప్పుడే విన్నా.. 100వ టెస్ట్‌కు ముందు విరాట్‌కు సచిన్ సందేశం..

Mutibagger Stock: లక్ష పెట్టుబడికి 5.48 లక్షలు లాభం.. 1860 శాతం రిటర్న్ ఇచ్చిన మల్టీ బ్యాగర్ స్టాక్..

Anupama Parameswaran: నీ కళ్లను నమ్మద్దు.. బ్రెయిన్‌ను కూడా.. ఆసక్తికరంగా అనుపమ బటర్‌ఫ్లై టీజర్‌..