AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anupama Parameswaran: నీ కళ్లను నమ్మద్దు.. బ్రెయిన్‌ను కూడా.. ఆసక్తికరంగా అనుపమ బటర్‌ఫ్లై టీజర్‌..

గ్లామ‌ర‌స్ రోల్స్ తోపాటు న‌ట‌న‌కు ఆస్కార‌మున్న పాత్రల్లో క‌నిపిస్తూ మెప్పిస్తోంది కేరళ కుట్టీ అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran). ఈ సంక్రాంతికి 'రౌడీ బాయ్స్‌' తో సందడి చేసిన ఈ బబ్లీ బ్యూటీ..

Anupama Parameswaran: నీ కళ్లను నమ్మద్దు.. బ్రెయిన్‌ను కూడా.. ఆసక్తికరంగా అనుపమ బటర్‌ఫ్లై టీజర్‌..
Anupama Parameswaran
Basha Shek
|

Updated on: Mar 03, 2022 | 12:59 PM

Share

గ్లామ‌ర‌స్ రోల్స్ తోపాటు న‌ట‌న‌కు ఆస్కార‌మున్న పాత్రల్లో క‌నిపిస్తూ మెప్పిస్తోంది కేరళ కుట్టీ అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran). ఈ సంక్రాంతికి ‘రౌడీ బాయ్స్‌’ తో సందడి చేసిన ఈ బబ్లీ బ్యూటీ.. అందులో ఇప్పటివరకు కనిపించిని రొమాంటిక్‌ యాంగిల్‌ను ఫ్యాన్స్‌కు పరిచయం చేసింది. త్వరలోనే ఆమె బటర్‌ఫ్లై (butterfly)గా మన ముందుకు రానుంది. ఇటీవల అనుపమ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన సినిమా ఫస్ట్‌ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. సుమారు 40 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో ఎలాంటి డైలాగులు వినిపించవు. టీజర్‌ మొత్తం అనుపమే కనిపిస్తోంది. ‘నీ కళ్లను నమ్మద్దు.. బ్రెయిన్‌ను కూడా నమ్మద్దు.. మరి వేటిని నమ్మాలి’ అంటూ టీజర్ లో వచ్చిన కొన్ని సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దీనిని చూస్తోంటే మిస్టరీ, హార్రర్‌ జోనర్‌లో ఈ సినిమాను తెరకెక్కించారని అర్థమవుతోంది.

జెన్‌నెక్స్ట్ మూవీస్ బ్యానర్‌పై రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న “బటర్‌ ఫ్లై” చిత్రానికి ఘంటా సతీష్ బాబు దర్శకత్వం వహించారు. కథ, స్క్రీన్‌ప్లే కూడా ఆయనే అందించారు. అర్విజ్, గిడియన్ కట్టా సంగీతాన్ని అందిస్తుండగా సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లేడీ ఓరియంటెడ్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని అప్‌డేట్స్ ను త్వరలోనే ప్రకటించనుంది చిత్రబృందం.

Also Read: Tea: మీరు రోజుకు ఎన్ని సార్లు చాయ్ తాగుతారు.. టీ తాగడంతో బరువు పెరుగుతారా.. తగ్గుతారా..?

DGP Mahender Reddy: రేవంత్ రెడ్డి ప్రచారం అవాస్తవం.. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఖండన..

Russia-Ukraine War: యుద్ధభూమి నుండి నేరుగా గ్రౌండ్ రిపోర్ట్.. వీడియో