Kamal Haasan: విక్రమ్‌ షూటింగ్‌కు కొబ్బరికాయ కొట్టేసిన కమల్‌.. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే..

లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Hasan) విశ్వరూపం 2 తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. రాజకీయాల్లో బిజీ అవ్వడం, తదితర కారణాలతో కెమెరాకు దూరంగా ఉండిపోయారాయాన

Kamal Haasan: విక్రమ్‌ షూటింగ్‌కు కొబ్బరికాయ కొట్టేసిన కమల్‌.. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే..
Vikram
Follow us
Basha Shek

|

Updated on: Mar 03, 2022 | 1:22 PM

లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Hasan) విశ్వరూపం 2 తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. రాజకీయాల్లో బిజీ అవ్వడం, తదితర కారణాలతో కెమెరాకు దూరంగా ఉండిపోయారాయాన. అయితే అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ త్వరలోనే విక్రమ్‌ (Vikram) గా రానున్నాడు. ఖైదీ, మాస్టర్‌ వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను రూపొందిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కమల్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా విక్రమ్‌ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా కమల్ కనిపించనున్నారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్‌కు ఫ్యాన్స్‌ నుంచి అపూర్వ స్పందన వచ్చింది. కాగా తాజాగా విక్రమ్‌ సినిమా షూటింగ్‌ పూర్తైనట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఫహద్ ఫాజిల్ గన్ పేల్చే వీడియోను విడుదల చేసిన మేకర్స్.. సినిమా విడుదల తేదీని కూడా లాక్ చేశారు.

ఈక్రమంలో మార్చి14న విక్రమ్ చిత్రం విడుదల తేదీని ప్రకటించబోతున్నట్టు ట్విట్టర్‌ వేదికగా చిత్రబృందం ప్రకటించింది. తెలుగులో కూడా అదే పేరుతో విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో మలయాళ నటుడు జయరామ్ తనయుడు కాళిదాస్ జయరాం, నరేన్ , ఆంటోనీ వర్గీస్, అర్జున్ దాస్, శివానీ నారాయణన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా శంకర్ దర్శకత్వంలో కమల్ నటిస్తోన్న ‘ఇండియన్ -2’ సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో కమల్ ఇప్పుడు విక్రమ్‌ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.

Also Read:Special Trains: హోలీ పండగకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైల్లు.. ఎక్కడి నుంచి ఎక్కడికో తెలుసా..

Anupama Parameswaran: నీ కళ్లను నమ్మద్దు.. బ్రెయిన్‌ను కూడా.. ఆసక్తికరంగా అనుపమ బటర్‌ఫ్లై టీజర్‌..

గర్భధారణ సమయంలో బెల్లం ఎందుకు తినాలంటే..

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్