OTT Movie: పరాయి వ్యక్తితో భార్య ఫస్ట్ నైట్.. మహిళలను వేధిస్తూ సంతోషపడే భర్త.. ఓటీటీలో రొమాంటిక్ రివేంజ్ మూవీ..
సౌత్ సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు వరలక్ష్మి శరత్ కుమార్. తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో లేడీ విలన్ పాత్రలతో అదరగొట్టేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన ఓ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగుతోపాటు తమిళం భాషలలో అనేక చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా పెద్దగా క్లిక్ కానీ ఆమె.. ఇప్పుడు విలన్ పాత్రలతో మాత్రం వెండితెరపై దూసుకుపోతుంది. నాంది సినిమాతో ముఖ్య పాత్రలో కనిపించిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఆ తర్వాత రవితేజ నటించిన క్రాక్, బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, సమంత నటించిన యశోద సినిమాల్లో విలన్ పాత్రలతో ఆకట్టుకుంది. అలాగే హనుమాన్ సినిమాలో హీరో తేజ సజ్జాకు అక్క పాత్రలో పాజిటివ్ రోల్ పోషించి మంచి మార్కులు కొట్టేసింది. ఇటీవల తమిళంలో వరలక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తారాయ తప్పట్టాయి. తమిళంలో జానపద కళాకారులు వాడే రెండు సంగీత వాయిద్యాల పేర్లే తారాయి, తప్పట్టాయి. ఈ చిత్రానికి అగ్ర దర్శకుడు బాలా దర్శకత్వం వహించారు.
ఇందులో హీరోహీరోయిన్ ఇద్దరికీ సంగీతం పై ఆసక్తి ఉంటుంది. హీరో సంగీతం వాయిస్తే..హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంటుంది. కానీ వీరిద్దరి మధ్యలోకి ఎంట్రీ ఇచ్చిన విలన్ హీరోయిన్ తల్లిని మోసం చేసి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఫస్ట్ నైట్ రోజే మరో వ్యక్తి దగ్గరకు భార్యను పంపిస్తాడు విలన్. అలాగే మహిళలను వేధిస్తూ.. వారిని చిత్రహింసలు పెడుతూ సంతోషపడుతుంటాడు. రాజకీయ నాయకుడికి బిడ్డను ఇచ్చేందుకు తన భార్యను పంపిస్తాడు. ఆ తర్వాత హీరో ఆమెను ఎలా కాపాడాడు ?.. చివరకు ఏం జరిగింది అనేది ఈ సినిమా స్టోరీ.
ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే కేవలం ఈ సినిమా తమిళంలోనే అందుబాటులో ఉంది. ఈ చిత్రాన్ని తెలుగులో సైతం డబ్ చేశారు. శ్రీవల్లి డ్యాన్స్ ట్రూప్ అనే టైటిల్ తో యూట్యూబ్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి :




