Thandatti: ఓటీటీలోకి రీసెంట్ తమిళ్ బ్లాక్ బస్టర్.. ‘తందట్టి’ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఇటీవల ఓటీటీల్లో తెలుగు సినిమాలే కాదు.. హిందీ మలయాళ, కన్నడ, తమిళ్ తదితర భాషల సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. తెలుగు ప్రేక్షకుల కోసం డబ్బింగ్ చేసి మరీ వీటిని స్ట్రీమింగ్‌కు తెస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అలా తమిళ్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఓ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది
ఇటీవల ఓటీటీల్లో తెలుగు సినిమాలే కాదు.. హిందీ మలయాళ, కన్నడ, తమిళ్ తదితర భాషల సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. తెలుగు ప్రేక్షకుల కోసం డబ్బింగ్ చేసి మరీ వీటిని స్ట్రీమింగ్‌కు తెస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అలా తమిళ్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఓ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. అదే ‘తందట్టి’.. ద స్టోరీ ఆఫ్ గోల్డ్ అనేది ట్యాగ్ లైన్. రామ్ సంగయ్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో పశుపతి రామస్వామి, రోహిణి, వివేక్ ప్రసన్న కీలక పాత్రలు పోషించారు. జూన్ 23న థియేటర్లలో విడుదలైన తందట్టి అక్కడి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. కలెక్షన్లు కూడా మంచిగానే వచ్చాయి. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ సినిమా ఓటీటీలో రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ తందట్టి మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. దీంతో ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రేపు (జులై 14) నుంచి ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది.
కాగా తందట్టి సినిమా తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇక కథ విషయానికొస్తే.. పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసే వీరసుబ్రమణియన్ (పశుపతి) పది రోజుల్లో రిటైర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సెల్వరాజ్ బామ్మ (రోహిణీ) కనిపించకుండా పోతుంది. ఆమెను వెతికి పట్టుకునే బాధ్యతను వీర సుబ్రమణియన్‌కు అప్పగిస్తారు. మరి అతను ఆ బామ్మను కనిపెట్టాడా? లేదా? ఈక్రమంలో కానిస్టేబుల్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అని తెలుసుకోవాలంటే తందట్టి సినిమా చూడాల్సిందే.
buckle up for a journey that defies all warnings and guarantees non-stop laughter 🤭#ThandattiOnPrime, July 14 pic.twitter.com/mc7H6yZaue
— prime video IN (@PrimeVideoIN) July 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.