AHA: ఔత్సాహిక మహిళలకు అద్భుత అవకాశం.. ఆహాలో ‘నేను సూపర్ వుమెన్‌’ బిజినెస్‌ రియాలిటీ షో.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

100 % లోక‌ల్ తెలుగు ఓటీటీ మాధ్యమంగా ప్రేక్షకుల హృద‌యాల్లో త‌నదైన స్థానాన్ని సంపాదించుకుంది ఆహా. ఇప్పుడు మ‌హిళా పారిశ్రామిక‌వేత్తల కోసం ద‌క్షిణ భార‌త‌దేశంలోనే తొలిసారిగా అతి పెద్ద బిజినెస్‌ రియాలిటీ షోను ఆడియెన్స్‌ ముందుకు తెస్తోంది.

AHA: ఔత్సాహిక మహిళలకు అద్భుత అవకాశం.. ఆహాలో 'నేను సూపర్ వుమెన్‌' బిజినెస్‌ రియాలిటీ షో.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Aha Nenu Super Woman
Follow us
Basha Shek

|

Updated on: Jul 13, 2023 | 5:40 PM

100 % లోక‌ల్ తెలుగు ఓటీటీ మాధ్యమంగా ప్రేక్షకుల హృద‌యాల్లో త‌నదైన స్థానాన్ని సంపాదించుకుంది ఆహా. ఇప్పుడు మ‌హిళా పారిశ్రామిక‌వేత్తల కోసం ద‌క్షిణ భార‌త‌దేశంలోనే తొలిసారిగా అతి పెద్ద బిజినెస్‌ రియాలిటీ షోను ఆడియెన్స్‌ ముందుకు తెస్తోంది. ‘నేను సూప‌ర్ వుమెన్’ అనే రియాలిటీ షో జులై 21 నుంచి ప్రతి శుక్ర, శ‌నివారాల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ సింగర్‌ శ్రీరామచంద్ర ఈ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కాగా మ‌హిళా సాధికార‌త‌ విషయంలో ఆహావారు ఎంత నిబద్ధ‌తగా ఉన్నార‌నే విష‌యాన్ని తెలియజేసేలా ఈ రియాలిటీ షోను తీర్చిదిద్దారు. ఇందుకోసం ఆహా ఓటీటీ మెంబర్స్ ఏంజెల్స్ కమిటీని కూడా రూపొందించారు. డార్విన్ బాక్స్ కో- ఫౌండర్‌ రోహిత్ చెన్నమనేని, క్వాంటేలా కంపెనీ కో ఫౌండర్‌ అండ్‌ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ శ్రీధ‌ర్ గాంధీ, సిల్వర్‌ నీడిల్‌ వెంచర్స్‌ రేణుక, అభి బస్‌ సీఈవో అండ్‌ కో ఫౌండర్‌ సుధాక‌ర్ రెడ్డి, దొడ్ల డైరీ ఫౌండ‌ర్ దొడ్ల దీపా రెడ్డి, బ‌జాజ్ ఎల‌క్ట్రానిక్ క‌ర‌ణ్ బ‌జాజ్‌, నారాయ‌ణ గ్రూప్ సింధూర పొంగూరు తదితర స‌క్సెస్‌ఫుల్ వ్యాపారవేత్తలు ఈ కమిటీలో ఉన్నారు. వీరు రియాలిటి షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్‌ ఐడియాలపై పెట్టుబడులతో బాటు, వారికి మార్గనిర్దేశకం చేయనున్నారు.

కాగా మొదటివారంలోనే నేను సూపర్‌ వుమెన్‌ ఏంజెల్స్‌ మహిళా స్టార్టప్‌ కంపెనీలో రూ.1.35 కోట్ల పెట్టుబడులను పెట్టారు. ఈ షో ద్వారా కేవలం పెట్టుబడి మాత్రమే కాకుండా ఏంజెల్స్‌ మెంటార్‌ షిప్‌, కార్పస్‌ ఫండ్‌ను కూడా అందుకోవచ్చు. మొత్తం 40 మంది కంటెస్టెంట్స్‌ ఏంజెల్స్‌ కమిటీ నుంచి ఫండింగ్‌, మెంటార్‌షిప్‌, కార్పస్‌ ఫండ్‌ను పొందే విధంగా ఈ రియాలిటీ షోను తీర్చిదిద్దింది ఆహా. తాజాగా నేను సూపర్‌ వుమెన్‌ రియాలిటీ షో కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా షో కమిటీ మెంబర్స్‌, మెంటార్స్‌ మాట్లాడుతూ నేను సూప‌ర్ వుమెన్ అనేది మహిళా సాధికార‌త‌ను పెంపెందించే కార్యక్రమమన్నారు. ఆహా సరికొత్త ప్రయాణంలో పాలు పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ మ‌హిళా సాధికారిక షోలో భాగం కావడం తమ అదృష్టమని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.