Satya Movie OTT: ఓటీటీలో తమిళ్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడు, ఎక్కడంటే?

సుమారు 26 ఏళ్ల క్రితం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సత్య ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత శర్వానంద్ తో సత్య2 తీసినా పెద్దగా ఆకట్టుకోలేదు. కాగా కొన్నాళ్ల కిందట సత్య పేరుతో తెలుగులో మరో సినిమా వచ్చింది. 0రామ్ గోపాల్ వర్మ సత్య గ్యాంగ్ స్టర్ మూవీ అయితే ఇది దానికి పూర్తిగా డిఫరెంట్ జానర్. తమిళంలో రంగోలి పేరుతో రిలీజైన ఈ సినిమాను తెలుగులో సత్యగా రిలీజ్ చేశారు.

Satya Movie OTT: ఓటీటీలో తమిళ్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడు, ఎక్కడంటే?
Satya Movie
Follow us

|

Updated on: Sep 02, 2024 | 7:03 PM

సుమారు 26 ఏళ్ల క్రితం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సత్య ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత శర్వానంద్ తో సత్య2 తీసినా పెద్దగా ఆకట్టుకోలేదు. కాగా కొన్నాళ్ల కిందట సత్య పేరుతో తెలుగులో మరో సినిమా వచ్చింది. రామ్ గోపాల్ వర్మ సత్య గ్యాంగ్ స్టర్ మూవీ అయితే ఇది దానికి పూర్తిగా డిఫరెంట్ జానర్. తమిళంలో రంగోలి పేరుతో రిలీజైన ఈ సినిమాను తెలుగులో సత్యగా రిలీజ్ చేశారు. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో హమరేశ్, ప్రార్థన సందీప్, మురగదాస్, సాయిశ్రీ నటించారు. వాలీ మోహన్ దాస్ దర్శకత్వం వహించాడు. మే 10న తెలుగులో ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తెలుగులోనూ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. శివ మల్లాల ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేశాడు. థియేటర్లలో ఆడియెన్స్ మెప్పు పొందిన సత్య సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ సత్య సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 7 నుంచి ఈ టీనేజ్ లవ్ స్టోరీని స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా ఓటీటీ సంస్థ.

ఈ సందర్భంగా సత్య సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసిన ఆహా ‘మన స్కూల్ లైఫ్ కనిపిస్తుంది.. సత్య సెప్టెంబర్ 7 నుంచి మీ ఆహాలో’ అని పోస్ట్ షేర్ చేసింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఇష్టం లేక తండ్రి కోరిక మేరకు ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదువుతుంటాడు సత్య. అక్కడ పార్వతి అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతున్నా బయటకు మాత్రం చెప్పదు. కానీ అనూహ్యంగా ఓ రోజు సత్యను చెంపదెబ్బ కొడుతుంది పార్వతి. దీంతో అతడు ఆ కాలేజీని వదిలేస్తాడు. మరి ఆ తర్వాత ఈ ఇద్దరి లవ్ స్టోరీ ఏమయ్యింది అన్నదే సత్య మూవీ కథ.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.