OTT Movie: ప్రెగ్నెంట్ మహిళల్ని మాటువేసి చంపే మంత్రగత్తె.. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూస్తే మైండ్ బ్లాక్
ప్రస్తుతం ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ మూవీస్ ను తెరకెక్కించడంలో మలయాళ దర్శకులు అందరి కంటే ఓ మెట్టు పైనే ఉన్నారు. ఈ ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కూడా ఇందుకు సరైన ఉదాహరణ.

కిష్కింద కాండం, సూక్ష్మ దర్శిని, రేఖా చిత్రం.. ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన మలయాళ చిత్రాలు. ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అందులోనూ మలయాళ సినిమాలకే ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువ ఓటు వేస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడబోయే సినిమా కూడా ఓ ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీనే. ఇందులో ఒక మంత్ర గత్తె కేవలం ప్రెగ్నెంట్ మహిళల్ని మాత్రమే టార్గెట్ చేసి చంపుతూ ఉంటుంది. అందుకు కారణమేంటన్నది ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ ఆద్యంతం ఈ మూవీ సస్పెన్స్ తో ముందుకు వెళ్తుంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కూడా ఆడియెన్స్ ను పక్కకు తలతప్పికోనివ్వదు. ఈ సినిమా పేరు పల్లిమని. అనిల్ కుంబ ఝా తెరకెక్కించిన ఈ సినిమాలో శ్వేత మీనన్, నిత్యాదాస్, కైలాష్ దినేష్, పనికర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2023 థియేటర్లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఓటీటీలోనూ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో పల్లిమని స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ లేదు కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ సినిమాను చూడవచ్చు.
పల్లి మని సినిమా కథ విషయానికి వస్తే..
ఒక భర్త తన ఇద్దరు పిల్లలు, గర్భిణీ భార్యతో కలిసి రాత్రి పూట ప్రయాణం చేస్తుంటాడు. బాగా పొద్దు పోవడంతో ఒక చర్చిలో ఆశ్రయం తీసుకుంటారు. అయితే అక్కడ వాళ్లను ఒక సీరియల్ కిల్లర్ వెంబడిస్తాడు. ఆ తరువాత అక్కడ ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అదే ఊరిలో ఒక మంత్ర గత్తె గర్భిణీ స్త్రీలను టార్గెట్ చేస్తుంది. మరి ఆ మంత్రగత్తె ఇలా ఎందుకు చేస్తుంది? సీరియర్ కిల్లర్, మంత్ర గత్తె నుంచి తన భార్యను కాపాడుకున్నాడా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే పల్లిమని సినిమా చూడాల్సిందే. మలయాళ గ్లామర్ బ్యూటీ శ్వేత మీనన్ ఈ సినిమాలో మంత్ర గత్తెగా అద్బుత నటనతో అదరగొట్టింది. గతంలో ఈ ముద్దుగుమ్మ రతి నిర్వేదం సినిమాతో తెలుగు ఆడియెన్స్ పలకరించింది. ఇక ఓటీటీల్లో సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి పల్లిమని సినిమా ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
పల్లిమని సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.