OTT Movie: ఇదెక్కడి సినిమా రా బాబూ.. భార్యను హింసిస్తూ అమ్మాయిలతో భర్త ఎఫైర్స్.. ఓటీటీలో బోల్డ్ మూవీ రచ్చ..
ఈమధ్య కాలంలో మలయాళం సినిమాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. హారర్, రొమాంటిక్, థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. స్టార్ హీరోస్ లేకుండా చిన్న సినిమాగా విడుదలై థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. తాజాగా థియేటర్లలో విజయం సాధించిన ఓ మలాయళం మూవీ ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చేసింది.

న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు షైన్ టామ్ చాకో. ఈ సినిమాలో విలన్ పాత్రలో అద్భుతమైన నటనతో జనాలను ఆకట్టుకున్నాడు. అంతకు ముందే మలయాళంలో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతడికి సౌత్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. చాలా సింపుల్ గా కనిపిస్తూనే పవర్ ఫుల్ విలనిజం పండించడం షైన్ టామ్ చాకో నైజం. ఎన్నో డిఫరెంట్ కంటెంట్ తో అడియన్స్ ముందుకు వస్తుంటాడు. ఇటీవల వివేకానందన్ విరలను సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు. గతేడాది జనవరి 19న విడుదలైన ఈసినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు అదే సినిమాతో తెలుగులోనూ అందుబాటులో ఉంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో షైన్ టామ్ చాకో సరసన ఐదుగురు హీరోయిన్స్ కనిపిస్తారు. శ్వాసిక విజయ్, గ్రేట్ ఆంటోని, మెరీనా మైఖేల్, రమ్య సురేశ్, మంజు పిళ్లై నటించారు. కామెడీ డ్రామా జోనర్లో వచ్చిన ఈ బోల్డ్ రొమాంటిక్ మూవీకి సీనియర్ దర్శకుడు కమల్ దర్శకత్వం వహించారు.
కథ విషయానికి వస్తే.. ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకుని వారిద్దరిని వేధిస్తుంటాడు ఓ భర్త. భార్య పల్లెటూరిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే.. భర్త ఉద్యోగం కోసం సిటీకి చేరుకుంటాడు. అక్కడ విలాసాలకు అలవాటు పడిన వివేకానందన్.. అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తుంటాడు. చివరకు అతడికి భార్యతో కలిసి ఆ అమ్మాయిలు ఎలా బుద్ది చెప్పారు అనేది సినిమా. ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఆహాలో ఫిబ్రవరి 7 నుంచి అందుబాటులోకి వచ్చింది. షైన్ టామ్ చాకో నటించిన 100వ సినిమా ఇదే కావడం విశేషం.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..