AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahma Anandam OTT: ఓటీటీలోకి వచ్చేసిన బ్రహ్మా ఆనందం.. తండ్రీ కొడకుల కామెడీ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

చాన్నాళ్ల తర్వాత బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'బ్రహ్మ ఆనందం'. ఈ మూవీలో బ్రహ్మానందంతో పాటు ఆయన కుమారుడు గౌతమ్ రాజా ఒక కీలక పాత్ర పోషించాడు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది.

Brahma Anandam OTT: ఓటీటీలోకి వచ్చేసిన బ్రహ్మా ఆనందం.. తండ్రీ కొడకుల కామెడీ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?
Brahma Anandam Movie
Basha Shek
|

Updated on: Mar 19, 2025 | 10:15 AM

Share

రంగ మార్తాండలో తన అద్భుతమైన నటనతో అందరికీ కన్నీళ్లు తెప్పించారు నటుడు బ్రహ్మానందం. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆయన మళ్లీ బ్రహ్మా ఆనందం సినిమాతో మన ముందుకు వచ్చారు. గతనెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ ను బాగానే అలరించింది. బ్రహ్మానందం యాక్టింగ్‌, కామెడీ టైమింగ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎప్పటిలాగే వెన్నెల కిశోర్ కూడా తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన బ్రహ్మ ఆనందం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం (మార్చి 19) నుంచి బ్రహ్మా ఆనందం సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఆహా ఓటీటీ గోల్డ్ సబ్ స్క్రైబర్స్ కు మాత్రమే అందుబాటులో ఉంది. గురువారం (మార్చి 20) నుంచి ఆహా యూజర్స్ అందరికీ ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పై రాహుల్ యాదవ్ నక్కా బ్రహ్మా ఆనందం సినిమాను నిర్మించారు. ఆర్వీఎస్ నిఖిల్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, తనికెళ్ల భరణి, రఘు బాబు, ప్రభాకర్, దివిజా ప్రభాకర్, దయానంద్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. శాండిల్య పిసపాటి సంగీతం అందించారు. మరి థియేటర్లలో బ్రహ్మా ఆనందం సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి కడుపుబ్బా నవ్వుకోండి.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న బ్రహ్మా ఆనందం..

కాగా తండ్రీ కొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ బ్రహ్మా ఆనందం సినిమాలో తాత, మనవళ్లుగా నటించడం విశేషం.  సినిమాలో వీరి ఇద్దరి మధ్య వచ్చే సీన్లు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి.

బ్రహ్మా ఆనందం సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్