Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Music School OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన శ్రియ కొత్త సినిమా.. ‘మ్యూజిక్‌ స్కూల్’ను ఎక్కడ చూడొచ్చంటే?

పిల్లలకు చ‌ద‌వులు ముఖ్య‌మా ? క‌ళ‌లు ముఖ్య‌మా? చిన్నతనంలో పిల్లలు ఎలా తమ కెరీర్‌ను ఎంచుకోవాలి? అన్న సున్నితమైన అంశాలతో మ్యూజిక్‌ స్కూల్‌ తెరకెక్కింది. పైగా మ్యాస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకు స్వరాలు అందించడం విశేషం. మే 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. బాక్సాఫీస్ వద్ద మోస్తరు కలెక్షన్లను రాబట్టింది.

Music School OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన శ్రియ కొత్త సినిమా.. 'మ్యూజిక్‌ స్కూల్'ను ఎక్కడ చూడొచ్చంటే?
Music School Movie
Follow us
Basha Shek

|

Updated on: Sep 10, 2023 | 7:38 PM

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్‌ శ్రియా శరణ్‌ కీలక పాత్రలో నటించిన సినిమా మ్యూజిక్‌ స్కూల్‌. మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు బియ్యాల తెరకెక్కించిన ఈ మూవీలో బాలీవుడ్ న‌టుడు శర్మాన్ జోషి, ప్ర‌కాశ్ రాజ్‌, లీలా సాంస‌న్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. పిల్లలకు చ‌ద‌వులు ముఖ్య‌మా ? క‌ళ‌లు ముఖ్య‌మా? చిన్నతనంలో పిల్లలు ఎలా తమ కెరీర్‌ను ఎంచుకోవాలి? అన్న సున్నితమైన అంశాలతో మ్యూజిక్‌ స్కూల్‌ తెరకెక్కింది. పైగా మ్యాస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకు స్వరాలు అందించడం విశేషం. మే 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. బాక్సాఫీస్ వద్ద మోస్తరు కలెక్షన్లను రాబట్టింది. అయితే మ్యూజిక్‌ స్కూల్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మ్యూజిక్‌ స్కూల్ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు సైలెంట్‌గా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసిందీ ఫీల్‌గుడ్‌ మూవీ. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్ల‌డించారు మేకర్స్‌.

పేరెంట్స్‌ ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చేలా..

మ్యూజిక్‌ స్కూల్‌ కథ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ స్కూల్. చదువు ఒక్కటే ముఖ్యమంటూ మిగతా వాటికి తమ పిల్లలను దూరంగా ఉంచేస్తారు పేరెంట్స్‌. అకాడ‌మిక్‌ పరీక్షల్లో తమ పిల్లలు సూప‌ర్ స్కోర్ చేయాల‌ని త‌ల్లితండ్రులు హైరానా పెడుతుంటారు. అదే సమయంలో ఆటలు, పాట‌లు, కళలు లాంటి ఎక్స్‌ట్రా కర్క్యూలర్‌ యాక్టివిటీస్‌కి తమ పిల్లల్ని దూరంగా పెడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో గోవాకు చెందిన మేరీ డిక్రూజ్(శ్రియ శరన్).. హైదరాబాద్‌ స్కూల్‌కి మ్యూజిక్‌ టీచరర్‌గా వస్తోంది. అప్పటికే అక్కడ డ్రామా టీచర్‌గా పనిచేస్తోన్న మనోజ్‌ (శర్మాన్‌ జోషి)తో స్నేహం చేస్తుంది. వీరిద్దరూ కలిసి పిల్లల తల్లిదండ్రులు ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. తమ విద్యార్థుల్లో ఉన్న ట్యాలెంట్‌ని వెతికి తీయాలనుకుంటారు. మరి శ్రియ ఆకాంక్ష ఎలా నెరవేరింది? అన్నది తెలుసుకోవాలంటే మ్యూజిక్‌ స్కూల్ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియోలో మ్యూజిక్ స్కూల్  స్ట్రీమింగ్..

శ్రియా శరణ్ లేటెస్ట్ ఫొటోస్

మ్యూజిక్ స్కూల్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..