Krishna Mukunda Murari Episode 11th September: నా ప్రేమకు అడ్డొస్తే భవానీ కుటుంబాన్ని కూడా లెక్కచేయని.. నేను పంతం పడితే అల్లాడతావని మురారిని హెచ్చరించిన ముకుంద.

ముకుంద మురారీని నా భర్తగా కోరుకుంటున్నా.. నా మనసులో మురారీకి తప్పవేరేవారికి స్తానం లేదు అని అనుకుంటుంది. అంతేకాదు భార్యాభర్తలైన కృష్ణ మురారీలను విడదీసి తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలని పట్టుదలతో ఉన్న ముకుంద తన తండ్రి శ్రీనివాస్ ను భవానీకి తమ ప్రేమ విషయం చెప్పెయ్యమంటుంది. కృష్ణ పొద్దున్నే నిద్ర లేచి మురారీకోసం వెదుకుకుంటుంది. ఈ రోజు (సెప్టెంబర్ 11వ తేదీన ) ఏమి జరుగుతుందో చూద్దాం.. 

Krishna Mukunda Murari Episode 11th September: నా ప్రేమకు అడ్డొస్తే భవానీ కుటుంబాన్ని కూడా లెక్కచేయని.. నేను పంతం పడితే అల్లాడతావని మురారిని హెచ్చరించిన ముకుంద.
Krishna Mukunda Murari
Follow us
Surya Kala

|

Updated on: Sep 11, 2023 | 7:08 AM

నిద్రలేచిన కృష్ణ మురారీకోసం వెదుకుతుంది. మరోవైపు అదే సమయంలో మురారీ ముకుందలు కలిసి మెట్ల మీద నుంచి కిందకు దిగుతూ కనిపిస్తారు. ఇదేమిటి ముకుందకు రోజూ జాగింగ్ కు వెళ్లే అలవాటు లేదు కదా.. ఇప్పుడు ఇద్దరూ కలిసి నాతో చెప్పకుండా వెళ్తున్నారు అని అనుకుంటుంది కృష్ణ. ఇంతలో మధు, అలేఖ్య లు ముకుంద విషయం మాట్లాడుకుంటారు. మధు కృష్ణ  మురారీలకు సపోర్ట్ చేస్తా అంటే.. నేను ముకుంద మురారీలకు సపోర్ట్ చేస్తానని అంటుంది అలేఖ్య.

కృష్ణను ఇంట్లో నుంచి పంపిస్తానని వార్నింగ్ ఇచ్చిన ముకుంద..

జాగింగ్ చేస్తున్న మురారీతో ముకుంద మాట్లాడాలని అనుకుంటున్నా అంటే.. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు నువ్వు.. నువ్వు ఇలాంటి ఎన్ని ప్లాన్స్ వేసినా..చివరకు చస్తానని బెదిరించినా ఐ డోంట్ కేర్.. చివరి కు నువ్వు ఇలాంటి దిగజారుడు పనులు .. ముకుంద గారు మీతో ఇలా మాట్లాడడం నా వల్ల కావడం లేదు.. మీరు నా ప్రాణ స్నేహితుడి భార్య మీతో కోపం గా మాట్లాడడం మీకు నీతులు చెప్పడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఇలా దారి కాయడం.. కృష్ణకు నాకు మధ్యలో దూరిపోవడం వంటివి చేస్తుంటే.. మీమీదున్న ఆ కాస్త గౌరవం కూడా పోతుందని మురారీ అంటుంటే.. వావ్ వాట్ ఏ డబుల్ యాక్షన్ మురారీ అదరగొట్టావు.. నువ్వు గుండెలు తీసిన బంటువు నువ్వు..  అంటుంటే.. మాట్లాడే దానిని పిచ్చి దానిలా కనిపిస్తుంన్నానా ఎగేసుకుని ఎక్కడికో వెళ్తున్నాడు నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఎంత దూరం వెళ్లినా చివరకు రావాలింది నా దగ్గరకే.. కలిసి బతికేది మనమే అంటుంది.. జీవితాతం నా ప్రేమకి అడ్డు పడతా అంటే నాకు కృష్ణ మీద ఎంత కోపం రావాలి.. నువ్వు కృష్ణను వెనకేసుకొస్తే నాకు ఇంకా కృష్ణ మీద కోపం పెరుగుతుంది.. నేను నిన్ను అంత తేలికగా వదులుకోను అని ముకుంద స్పష్టం చేస్తుంది మురారీకి.

నేను పంతం పడితే అల్లాడతావని మురారిని హెచ్చరించిన ముకుంద..

మురారీతో ముకుంద ఛాలెంజ్ చేస్తుంది తాను కృష్ణను ఇంటి నుంచి వెళ్లిపోయేలా చేస్తానని.. ఆదర్శ్ ను ఇంటికి రానివ్వనని.. ఒకవేళ వచ్చినా ఎలా వచ్చాడో అలాగే పారిపోయేలా చేస్తానని ముకుంద మురారీని హెచ్చరిస్తుంది. నీకు నాకు మధ్యలో ఎవరూ వచ్చినా నా ధాటికి ఎవరూ తట్టుకోలేరు.. ఇప్పటి వరకూ నా ప్రేమని మాత్రమే చూశావు.. నా పంతాన్ని చూడలేదు.. చూడాలని అనుకోకు అల్లాడి పోతావ్ అని ముకుంద మురారీని హెచ్చరించింది. మురారీ బైక్ మీద ఇద్దరూ తిరిగి ఇంటికి వస్తారు.

ఇవి కూడా చదవండి

తన భర్త ప్రేమ తనకు కావాలని కోరుకున్న కృష్ణ

కృష్ణ తులసమ్మకి దణ్ణం పెట్టుకుంటుంటే.. నాకు మంచి మనసున్న వాడిని భర్తగా ఇచ్చావు.. నా ప్రేమ ఫలించి నా కాపురం చక్కగా ఉండేలా దీవించు అని అనుకుంటుంటే.. మురారీ ముకుంద కలిసి బండి దిగుతారు.  అది చూసి కృష్ణ షాక్ తింటుంది. కోపంతో మురారీ పిలిచినా పట్టించుకోదు. ముకుందని మురారీ చేతిలో పట్టుకుని తీసుకుని వస్తాడు. నా భర్త ఇంకొక అమ్మాయిని పట్టుకున్నాడు అని అనుకుంటే ఇంత జెలసీ వస్తుంది.. నాకు చాలా బాధ వేస్తుంది. వాళ్ళిద్దరి మీద అనుమానం వస్తుంది .. అనుకుంటూనే.. తప్పు నాకు ఇద్దరిమీద నమ్మకం ఉంది అనుకుంటుంది కృష్ణ. ముకుంద కావాలనే ఇలా చేస్తుంది .. ముకుంద స్పీడ్ కు బ్రేక్ వెయ్యాలని అనుకుంటున్నాడు మురారీ.

కృష్ణ వచ్చి ముకుంద కాలు ఎలా ఉంది అని అంటే.. బాగానే ఉంటుంది.. తాను మురారీ బైక్ ఎక్కబోతుంటే స్లిప్ అయ్యాను అని అని కృష్ణకు చెప్పేస్తుంది ముకుంద. అప్పుడు మురారీనే తన్నాడు బైక్ ఎక్కించాడని చెప్పి స్నానానికి వెళ్తుంది. ఏసీపీ సార్ అబద్దం చెప్పారా.. ముకుంద చెబుతుందా..పైకి రావడానికి అంత ఇబ్బంది పడింది.. ఇప్పుడు నార్మల్ అయింది ఏమిటి అనుకుంటుంది కృష్ణ..

కృష్ణకు మా మీద చిన్న చిన్నగా డౌట్ వచ్చేలా చేసి ఏదొక రోజు మా విషయం ఫుల్ గా చెప్పేస్తానని అనుకుంటుంటే.. అలేఖ్య వస్తుంది. తనకు ఇక నుంచి అన్నీ హ్యాపీ డేస్ నే అని అంటుంటే.. నువ్వు ముకుంద లవ్స్ మురారీ అని రాశావు కదా.. దానిని మార్చింది మధునే అని చెబుతుంది.

రేపటి ఎపీషోడ్ లో

నువ్వు మొన్న నాకు ఏదో చూపిస్తాన్నవు కదా ఏమిటది అని ముకుందని అడుగుతుంది భవానీ..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?