- Telugu News Photo Gallery Cinema photos 'Brahmamudi' fame Maanas marriage vibes started.. Haldi photos goes viral
Maanas Marriage: ‘బ్రహ్మముడి’ ఫేమ్ మానస్ పెళ్లి వేడుకలు షురూ.. ‘హల్దీ’ సెలబ్రేషన్స్ ఫొటోలు చూశారా?
బ్రహ్మముడి' ఫేమ్ మానస్ ఇంట పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. కొద్ది రోజుల క్రితం శ్రీజ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న ఈ బిగ్‌బాస్ నటుడు త్వరలోనే ఆమెతో కలిసి కొత్త జీవితం ప్రారంభించనున్నాడు. పెళ్లి వేడుకల్లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 10) హల్దీ వేడుక గ్రాండ్‌గా జరిగింది.
Updated on: Sep 10, 2023 | 6:01 PM

బ్రహ్మముడి సీరియల్‌కు ముందు గతంలో పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించాడు మానస్. అలాగే బిగ్ బాస్ సీజన్ 5 ఫైనలిస్ట్‌లలో ఒకడిగా నిలిచాడు. అలాగే సోడా గాలిసోడా, ప్రేమికుడు, గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్, కాయ్ రాజా కాయ్ వంటి సినిమాల్లో నటించా

కాగా ప్రస్తుతం బుల్లితెరపై టాప్ మోస్ట్ టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతోన్ బ్రహ్మముడి సీరియల్‌లో మానస్ మెయిన్ రోల్ పోషించాడు. ఇందులో అతను పోషించిన రాజ్ పాత్ర అందరినీ ఆకట్టుకుంది.

ప్రస్తుతం మానస్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు నటుడికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

హల్దీ సెలబ్రేషన్స్ కోసం ఇంటిని ఎంతో అందంగా ముస్తాబు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు మానస్. పసుపు దంచే కార్యక్రమం ఉందంటూ ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చాడు.

'బ్రహ్మముడి' ఫేమ్ మానస్ ఇంట పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. కొద్ది రోజుల క్రితం శ్రీజ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న ఈ బిగ్‌బాస్ నటుడు త్వరలోనే ఆమెతో కలిసి కొత్త జీవితం ప్రారంభించనున్నాడు. పెళ్లి వేడుకల్లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 10) హల్దీ వేడుక గ్రాండ్‌గా జరిగింది.




