Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baby Movie: టీవీలోకి వచ్చేస్తోన్న ‘బేబీ’ మూవీ.. ఏ ఛానెల్‌లో ఎప్పుడు టెలికాస్ట్‌ కానుందంటే?

ఈ ఏడాది అతి పెద్ద విజయం సాధించిన చిన్న సినిమాల్లో 'బేబీ' ముందుంటుంది. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీగా యూత్‌కు తెగ నచ్చేసింది. దీంతో 7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన బేబీ బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.90 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత ఓటీటీలోనూ రిలీజై రికార్డు స్థాయిలో వ్యూస్‌ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోన్న బేబీ సినిమా త్వరలో టీవీలోకి కూడా రానుంది.

Baby Movie: టీవీలోకి వచ్చేస్తోన్న 'బేబీ' మూవీ.. ఏ ఛానెల్‌లో ఎప్పుడు టెలికాస్ట్‌ కానుందంటే?
Baby Movie
Follow us
Basha Shek

|

Updated on: Sep 10, 2023 | 3:42 PM

ఈ ఏడాది అతి పెద్ద విజయం సాధించిన చిన్న సినిమాల్లో ‘బేబీ’ ముందుంటుంది. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీగా యూత్‌కు తెగ నచ్చేసింది. దీంతో 7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన బేబీ బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.90 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత ఓటీటీలోనూ రిలీజై రికార్డు స్థాయిలో వ్యూస్‌ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోన్న బేబీ సినిమా త్వరలో టీవీలోకి కూడా రానుంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఈటీవీ ఛానెల్‌ కొనుగోలు చేసింది. సెప్టెంబర్ 24న సాయంత్రం 5.30 గంటలకు ఈటీవీ ఛానెల్‌లో ఈ బ్లాక్‌ బస్టర్‌ సినిమా టెలికాస్ట్‌ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఛానెల్స్ నిర్వాహకులు. బేబీ సినిమాకు సాయి రాజేష్‌ దర్శకత్వం వహించారు. మాస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఎస్‌కేఎన్‌ ఈ ఫీల్‌గుడ్‌ సినిమాను తెరకెక్కించారు. బేబీ సినిమాతో ఒక్కసారిగా పాపులరైపోయింది హీరోయిన్‌ వైష్ణవి చైతన్య. సినిమాలో ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. మొదటి సినిమాతోనే మ‌ల్టీపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో అద‌ర‌గొట్టిందీ ట్యాలెంటెడ్‌ నటి. కాలేజీ అమ్మాయిగా అమాయకంగా ఉంటూనే, కన్నింగ్‌నెస్‌ ఉన్న పాత్రలో వైష్ణవి అభినయానికి పలువురి ప్రశంసలు దక్కాయి.

త్వరలోనే ఈటీవీ ఛానెల్ లో ప్రసారం..

ఇక ఆటోడ్రైవర్‌గా, ప్రేమలో విఫలమైన అబ్బాయిగా ఆనంద్‌ దేవరకొండ కూడా అదరగొట్టాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆనంద్‌ నటన అందరికీ కన్నీళ్లు తెప్పిస్తుంది. ఇక విరాజ్‌ అశ్విన్‌ కూడా తన స్టైలిష్‌ లుక్‌తో మెప్పించాడు. బేబీ సినిమాకు మరో ప్లస్‌ పాయింట్.. విజయ్‌ బుల్గానిన్‌ అందించిన స్వరాలు. కథకు తగ్గట్టుగా సాగే పాటలు, బీజీఎమ్ ఈ ఫీల్‌గుడ్‌ ప్రేమకథను నెక్ట్స్‌లెవెల్‌కి తీసుకెళ్లాయి. ప్రస్తుతం బేబీ సినిమాలో భాగమైనవారంతా బంపర్‌ ఆఫర్లు అందుకుంటున్నారు. హీరోయిన్‌ వైష్ణవి చైతన్య, హీరోలు ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌లు తమ నెక్ట్స్‌ ప్రాజెక్టుల్లో బిజీగా ఉంటున్నారు. సో.. థియేటర్లు, ఓటీటీలో అదరగొట్టిన బ్లాక్‌ బస్టర్‌ బేబీని టీవీలో చూసి ఎంజాయ్‌ చేయండి..

ఇవి కూడా చదవండి

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న బేబీ 

View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)

వైష్ణవి చైతన్య లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి
పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి
TVలో క్రైం షోలు చూసి భార్యను చంపిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
TVలో క్రైం షోలు చూసి భార్యను చంపిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
వామ్మో.. మరో కొత్త వైరస్ వచ్చేసింది.. కోల్‌కతా మహిళకు పాజిటివ్‌..
వామ్మో.. మరో కొత్త వైరస్ వచ్చేసింది.. కోల్‌కతా మహిళకు పాజిటివ్‌..
లండన్‌లో ల్యాండైన మెగాస్టార్..
లండన్‌లో ల్యాండైన మెగాస్టార్..
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..వీడియో
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..వీడియో
ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
మా కళ్ల ముందే ఇద్దరిని కాల్చి చంపారు..ఐడీ కార్డులు చెక్‌ చేసి..వీ
మా కళ్ల ముందే ఇద్దరిని కాల్చి చంపారు..ఐడీ కార్డులు చెక్‌ చేసి..వీ
శ్రీలీల,కార్తిక్‌ ఆర్యన్‌ డేటింగ్‌.. హీరో తల్లి షాకింగ్ కామెంట్స్
శ్రీలీల,కార్తిక్‌ ఆర్యన్‌ డేటింగ్‌.. హీరో తల్లి షాకింగ్ కామెంట్స్
పిచ్చి పీక్‌ స్టేజ్‌లో.. బతికి ఉన్న బొద్దింకతో కృతిమ గోరు తయారీ
పిచ్చి పీక్‌ స్టేజ్‌లో.. బతికి ఉన్న బొద్దింకతో కృతిమ గోరు తయారీ
10th విద్యార్ధులకు అలర్ట్.. జవాబు పత్రాల మూల్యంకనం ఎప్పట్నుంచంటే!
10th విద్యార్ధులకు అలర్ట్.. జవాబు పత్రాల మూల్యంకనం ఎప్పట్నుంచంటే!