Dragon OTT : మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ మూవీ.. డ్రాగన్ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే..
అటు హీరోగా.. ఇటు దర్శకుడిగా సౌత్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నాడు ప్రదీప్ రంగనాథన్. లవ్ టూడే సినిమాతో దక్షిణాదిలో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు. దీంతో ఇటు తెలుగులోనూ మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. ఇటీవలే రొమాంటిక్ కామెడీ మూవీ డ్రాగన్ తో మరోసారి సందడి చేశాడు. ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

కోలీవుడ్ డైరెక్టర్ కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ డ్రాగన్. అంతకు ముందు లవ్ టూడే సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు డ్రాగన్ సినిమాతోనూ మరోసారి సక్సెస్ అయ్యాడు. తమిళంలో భారీ హిట్ అందుకున్న ఈ సినిమాను తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరుతో రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు ఫిదా అయ్యారు. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ అటు అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో విడుదలైన నెల రోజులకు ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది ఈసినిమా. మరికొన్ని గంటల్లో ఓటీటీ మూవీ లవర్స్ ముందుకు రాబోతుంది డ్రాగన్.
మార్చి 21 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మార్చి 21 నుంచి అంటే మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి రానుంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాను తీసుకువస్తుంది నెట్ ఫ్లిక్స్. థియేటర్లలో విడుదలైన సరిగ్గా నెల రోజులకు ఓటీటీలోకి వస్తుంది.
డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కాయదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో మరోసారి తనదైన నటనతో మెప్పించాడు ప్రదీప్. ఈ మూవీలో కేఎస్ రవి కుమార్, గౌతమ్ మీనన్, స్నేహ, మిస్కిన్, హర్షంత్ ఖాన్, మరియం జార్జ్ కీలకపాత్రలు పోషించారు.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..