OTT Movie: 10 కోట్లతో తీస్తే 60 కోట్లు.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
కిష్కింద కాండం, సూక్ష్మ దర్శిని, రేఖా చిత్రం.. ఇటీవల ఓటీటీ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్న మలయాళం సినిమాలు. ఇప్పుడు జాబితాలోకి మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేరింది. ఇటీవల మలయాళంలో థియేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఓ మూవీ తెలుగులో ఓటీటీలోకి వచ్చేసింది.

ఇటీవల మలయాళంలో తెరకెక్కుతోన్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ సినిమాలు ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఓటీటీలో ఈ సినిమాలకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. కిష్కింద కాండం, సూక్ష్మ దర్శిని, రేఖా చిత్రం సినిమాలే ఇందుకు ప్రధాన ఉదాహరణలు. ఇప్పుడు తెలుగు ఓటీటీ ఆడియెన్స్ ను అలరించేందుకు మరో మలయాళం మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అదే ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ. తెలుగు ఆడియెన్స్ కు బాగా పరిచయమున్న నటుడు కుంచకో బోబన్ ఈ మూవీలో ప్రధాన పాత్ర చేశారు. ఫిబ్రవరి 20న మలయాళంలో థియేటర్లలో రిలీజైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అక్కడి ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం రూ. 10 కోట్లతో తీసిన ఈ సినిమా ఒక్క మలయాళంలోనే ఏకంగా రూ. 60 కోట్ల వరకు రాబట్టింది. దీంతో తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ కు ప్లాన్ చేశారు మేకర్స్. మొదట మార్చి 7న ఆఫీసర్ ఆన్ డ్యూటీ తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఆ డేట్ ఎందుకో కుదరలేదు. దీంతో మార్చి 14న తేదీన తెలుగు ఆడియెన్స్ ముందుకు ఈ సినిమాను తీసుకొచ్చారు. అయితే పెద్దగా ప్రమోషన్లు నిర్వహించలేదు. దీంతో కనీసం ఈ సినిమా థియేటర్లలో విడుదలైనట్లు కూడా చాలా మందికి తెలియదు. అయితే ఇప్పుడీ సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మార్చి 20 నుంచే ఈ సినిమాను ఓటీటీలోకి స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ ఇదివరకే అధికారికంగా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే గురువారం అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..
When the officer steps in, crimes step out 😎 Watch Officer On Duty now on Netflix in Malayalam, Hindi, Telugu, Tamil and Kannada!#OfficerOnDutyOnNetflix pic.twitter.com/6Fn2Gybabg
— Netflix India South (@Netflix_INSouth) March 20, 2025
థియేటర్లలో రిలీజైన వారానికే..
ఆఫీసర్ ఆన్ డ్యూటీ మలయాళ వెర్షన్ కి నెలరోజుల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి రావడం ఒకే. కానీ తెలుగులో మరీ థియేటర్లలోకి వచ్చిన వారానికే ఈమూవీ ఓటీటీలోకి రావడం గమనార్హం. జితు అష్రాఫ్ తెరకెక్కించిన ఈ సినిమాలో జగదీష్, విశాక్ నాయర్, ఆడుకలం నరేన్, వైశాఖ్ శంకర్, విష్ణు జి. వారియర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూర్చారు. వీకెండ్ లో ఓటీటీలో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను చూడాలనుకుంటున్నారా? అయితే ఆఫీసర్ ఆన్ డ్యూటీ మీకు మంచి ఛాయిస్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.