OTT Movie: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన జగిత్యాల టైగర్ బయోపిక్.. జితేందర్ రెడ్డి సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?
తెలంగాణలోని జగిత్యాల ప్రాంతానికి చెందిన ఆర్ఎస్ఎస్ లీడర్ జితేందర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం జితేందర్ రెడ్డి. గతేడాది నవంబర్ లో థియేటర్లలో రిలీజైన ఈ బయోపిక్ తెలుగు ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

బాహుబలి నటుడు రాకేశ్ వర్రే ఈ మధ్యన హీరోగానూ ఆకట్టుకుంటున్నాడు. ఎవరికి చెప్పొద్దు, పేక మేడలు సినిమాలతో ఆకట్టుకున్నాడు రాకేశ్. ఇదే కోవలో అతను నటించిన మరో చిత్రం జితేందర్ రెడ్డి. తెలంగాణలోని జగిత్యాల ప్రాంతానికి చెందిన ఏబీవీపీ నాయకుడు జితేందర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా డైరెక్టర్ విరించి వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. రాకేశ్ వర్రేతో పాటు వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, రవిప్రకాష్, సుబ్బరాజు తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు వహించారు. గతేడాది నవంబర్ 8 న థియేటర్లలో విడుదలైన జితేందర్ రెడ్డి ఓ మోస్తరుగా ఆడింది. ముఖ్యంగా తెలంగాణ ఆడియెన్స్ కు ఈ బయోపిక్ బాగానే కనెక్ట్ అయ్యింది. అయితే పేరున్న నటీనటులు లేకపోవడం ఈ సినిమాకు మైనస్ గా మారింది. అందుకే ఈ సినిమా లాంగ్ రన్ కొనసాగించలేకపోయింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ బయోపిక్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. జితేందర్ రెడ్డి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. ముందుగా ప్రకటించినట్లుగానే గురువారం (మార్చి 20) నుంచి ఈ సినిమాను ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన సుమారు నాలుగు నెలల తర్వాత ఈ పొలిటికల్ బయోపిక్ ఓటీటీలోకి రావడం గమనార్హం.
ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి జితేందర్ రెడ్డి సినిమాను నిర్మించారు. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కాలేజీ రోజుల నుంచే ఉద్యమాలే ఊపిరిగా బతుకుతుంటాడు జితేందర్ రెడ్డి. తెలంగాణ లో నెలకొన్న సామాజిక అసమానతలపై ఆయన ఎలాంటి పోరాటం చేశాడు? నక్సలైట్లకు ఎందుకు టార్గెట్ గా మారాడు? అనే అంశాలను ఈ సినిమాలో చూపించారు. ఎన్టీఆర్, వాజ్‌పేయి లాంటి నాయకులు తీసుకున్న కొన్ని నిర్ణయాలను కూడా ఈ మూవీలో ప్రస్తావించడం గమనార్హం.
The revolution begins NOW! 🔥 Jithender Reddy is streaming exclusively on @etvwin. Watch the fight for power and justice unfold! 🎬⚡ Watch now: https://t.co/YnO9LOyzqD
Directed by @virinchivarma 🎬@rakesh_varre @IRiyaSuman @GopiSundarOffl @gnanashekarvs @RavinderReddyIN… pic.twitter.com/eciNBtWvol
— ETV Win (@etvwin) March 20, 2025
మరి థియేటర్లలో ఈ పొలిటికల్ బయోపిక్ ను మిస్ అయ్యారా? అయితే ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎంచెక్కా ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయండి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .