Telugu Indian Idol 3: ఆ ఇద్దరికి తమన్ బంపర్ ఆఫర్.. ‘OG’లో పాట పాడిన కంటెస్టెంట్స్.. పవన్ కళ్యాణ్ ఫిదా..

ఎంతో మందిని ఫిల్టర్ చేసిన తర్వాత 12 మందిని షోకు ఎంపిక చేశారు. వీరిలో భరత్ రాజ్, కీర్తన, కేశవ్ రామ్, హరి ప్రియ, శ్రీ కీర్తి, నసీరుద్దీన్, స్కంద, దువ్వూరి శ్రీధృతి, రజనీ శ్రీ, సాయి వల్లభ, ఖుషాల్ శర్మ, అనిరుధ్ సుస్వరం సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు అనిరుధ్ సుస్వరం, స్కంద, కీర్తన, శ్రీ కీర్తి, భరత్, నసీరుద్దీన్ ఆరుగురు ఫైనల్ కు చేరుకున్నారు.

Telugu Indian Idol 3: ఆ ఇద్దరికి తమన్ బంపర్ ఆఫర్.. 'OG'లో పాట పాడిన కంటెస్టెంట్స్.. పవన్ కళ్యాణ్ ఫిదా..
Telugu Indian Idol
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 06, 2024 | 1:09 PM

ప్రముఖ తెలుగు ఓటీటీ దిగ్గజం ఆహా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వెబ్ సిరీస్, మూవీస్, రియాల్టీ షోస్ తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన చిత్రాలను తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తుంది ఆహా. అలాగే మరికొన్ని షోస్ కూడా అడియన్స్ ముందుకు తీసుకువస్తుంది. అందులో తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షో ఒకటి. తెలుగు సినీరంగంలోకి సరికొత్త గాయనీగాయకులను పరిచయం చేస్తుంది. ఇప్పటికే రెండు సీజన్స్ విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు మూడో సీజన్ నడుస్తోంది. ‘తెలుగు ఇండియన్ ఐడల్ 3‘ చివరి దశకు చేరుకుంది. త్వరలో ఈ షో విజేత ఎవరో తేలియనుంది. ఎంతో మందిని ఫిల్టర్ చేసిన తర్వాత 12 మందిని షోకు ఎంపిక చేశారు. వీరిలో భరత్ రాజ్, కీర్తన, కేశవ్ రామ్, హరి ప్రియ, శ్రీ కీర్తి, నసీరుద్దీన్, స్కంద, దువ్వూరి శ్రీధృతి, రజనీ శ్రీ, సాయి వల్లభ, ఖుషాల్ శర్మ, అనిరుధ్ సుస్వరం సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు అనిరుధ్ సుస్వరం, స్కంద, కీర్తన, శ్రీ కీర్తి, భరత్, నసీరుద్దీన్ ఆరుగురు ఫైనల్ కు చేరుకున్నారు. ఈ ఆరుగురు ఫైనలిస్టులు అద్భుతమైన పాటలతో ఆకట్టుకుంటున్నారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో వినాయక చవితి ఫెస్టివల్ సందర్భంగా వినాయకుడి పాటలతో అలరించారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్స్ ఈనెల 6, 7న స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్స్ నసీరుద్ధీన్, భరత్ ఇద్దరికీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘OG’ సినిమాలో పాట పాడే అవకాశం కల్పించారు. ఇటీవలే ఆ పాటను కూడా రికార్డింగ్ చేశారట. ఆ ఇద్దరు పాడిన పాటను విన్న పవన్ కల్యాణ్.. నసీరుద్దీన్, భరత్ వాయిస్ కు ఫిదా అయ్యారని .. వారిద్దరిపై ప్రశంసలు కురిపించారని థమన్ తెలిపాడు. తమన్ మాటలు విని నసీరుద్దీన్, భరత్ సంతోషం వ్యక్తం చేయగా.. అక్కడున్న కంటెస్టెంట్స్ ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరలవుతుండగా.. నసీరుద్ధీన్, భరత్ కు అభినందనలు తెలుపుతున్నారు.

ప్రస్తుతం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఓజీ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన సినిమా షూటింగ్స్ కు కాస్త బ్రేక్ పడింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదల కాబోతున్న తొలి సినిమా ‘OG’ కావడంతో ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రోమో చూసేయ్యండి.. 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!