- Telugu News Photo Gallery Cinema photos Aha Telugu Indian Idol latest promo goes trending on 04 September 2024
Indian Idol Season 3: అంచనాలు పెంచేస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్.! ఇక్కడ నిలిచేది ఎవరు? గెలిచేది ఎవరు?
ఫినాలే సమరం మొదలైంది... టాప్ ఫైవ్‌లో ప్లేస్ కోసం స్వర యుద్ధం జరుగుతోంది.. ఇక్కడ నిలిచేది ఎవరు? నిలిచి గెలిచేది ఎవరు? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నుంచి ఆల్రెడీ ప్రశంసలు అందుకున్నది ఎవరు.? తెలియాలంటే ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 లో ఈ వారం ఎపిసోడ్ అస్సలు మిస్ కావద్దు. ఈ వారం ఎపిసోడ్ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పేస్తోంది ప్రోమో.! టాప్ ఫైవ్ స్థానాల కోసం జరుగుతున్న స్వర యుద్ధం..
Updated on: Sep 06, 2024 | 9:59 PM

ఫినాలే సమరం మొదలైంది... టాప్ ఫైవ్‌లో ప్లేస్ కోసం స్వర యుద్ధం జరుగుతోంది.. ఇక్కడ నిలిచేది ఎవరు? నిలిచి గెలిచేది ఎవరు? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నుంచి ఆల్రెడీ ప్రశంసలు అందుకున్నది ఎవరు.?

తెలియాలంటే ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 లో ఈ వారం ఎపిసోడ్ అస్సలు మిస్ కావద్దు. ఈ వారం ఎపిసోడ్ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పేస్తోంది ప్రోమో..!

టాప్ ఫైవ్ స్థానాల కోసం జరుగుతున్న స్వర యుద్ధం... నెక్స్ట్ గ్లోబల్ సింగింగ్ స్టార్ ఎవరు? అంటూ విడుదలైన.. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ లేటెస్ట్ ప్రోమో.. ఎపిసోడ్ మీద అంచనాలు పెంచేస్తోంది.

రాగాలతో, కీర్తనలతో వినాయకచవితి వేడుక చేసుకుందాం అంటూ ఎలాంటి పాటలు ఉండబోతున్నాయో లీలగా హింట్ ఇచ్చేసింది టీమ్. అసలు సిసలైన రాగాలకు, వినసొంపైన వాయిద్యాలు తోడైతే అక్కడ సంగీతం పండగ చేసుకోకుండా ఉంటుందా?

ఈ వారం ఎపిసోడ్‌లు పండగలాగా ముస్తాబయ్యాయి. మన సంస్కృతిని ప్రతిబింబించే సంప్రదాయ వేషధారణలో కంటెస్టంట్లు కూడా మెప్పించారు. ఆహా ఇండియన్ ఐడల్ సీజన్స్ లో ఇంతకు ముందెప్పుడూ జరగనంతగా రేస్ టు ఫినాలే మొదలైందని జడ్జిలు చెబుతుంటే ఆడియన్స్ కి గూస్‌బంప్స్ వచ్చేశాయి.

అంతకు మించిన టాప్ సీక్రెట్‌ని రివీల్ చేశారు తమన్. పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీలో ఇండియన్ ఐడల్ సింగర్స్ ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు తమన్. ఇంకా ఫైనల్స్ కానేలేదు.. అప్పుడే అద్భుతమైన ఆఫర్‌ని కొట్టేశారు కంటెస్టంట్లు.

అంతే కాదు, వారి పాటకు ఏపీ డిప్యూటీ సీఎం నుంచి కూడా అప్లాజ్ వచ్చింది.. ఈ విషయాలన్నిటినీ తనివితీరా చూడాలంటే డోంట్ మిస్ ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 3.. ఈ వారం ఎపిసోడ్స్.




